హీరో అనేవారు ఎవరైనా కసరత్తులు చేయడం కామన్.. కాని వారు ఏం తింటారు.. ఎలా మెయింటేన్ చేస్తున్నారు అనేదే ప్రతీ ఒక్కరు గమనించే పాయింట్. ప్రతీ హీరో ఏలా ఉంటారు.. ఇంట్లో వాళ్ళు ఏం తింటారు.. ఏం తింటే ఇలా ఫిట్ గా ఉంటారు అనేది తెలుసుకోవడం కోసం ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అంతే కాదు అది వాళ్లు కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తుంటారు.

దాదాపుగా 50 ఏళ్లకు దగ్గరగా ఉన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) అయినా సరే 30 ఏళ్లు అంటే ఈజీగా నమ్మేయొచ్చు.. మరి సూపర్ స్టార్ అంత ఫిట్ గా ఉండగానికి కారణం ఏంటీ...? మరి ముఖ్యంగా ఆయన బ్రేక్ ఫాస్ట్ సీక్రేట్(Breakfast Secret) ఏంటో తెలుసా..?సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే అందరు మాట్లాడుకునే విషయం ఆయన గ్లామర్... ఫిట్ నెస్.. కలర్.. ప్రస్తుతం 47 ఏళ్ళ మహేష్ బాబు.. నెక్ట్స్ మన్త్ లో 48లోకి వస్తారు. ఇంకా రెండేళయితే.. 50 ఏళ్లు వయస్సులోకి వస్తాడు సూపర్ స్టార్.. అయినా సరే 20 ఏళ్ల కుర్రాడిలా ఉత్సాహంగా ఉంటాడు. ఫిట్ గా తళతళలాడే కలర్ తో.. ముట్టుకుంటే మాసిపోయేలా ఉంటాడు మహేష్ బాబు. అంతే కాదు హెల్త్ పరంగా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాడు. మరి ఆయన ఏం తింటాడు..? ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ లో ఏం తీసుకుంటాడు..?

హీరో అనేవారు ఎవరైనా కసరత్తులు చేయడం కామన్.. కాని వారు ఏం తింటారు.. ఎలా మెయింటేన్ చేస్తున్నారు అనేదే ప్రతీ ఒక్కరు గమనించే పాయింట్. ప్రతీ హీరో ఏలా ఉంటారు.. ఇంట్లో వాళ్ళు ఏం తింటారు.. ఏం తింటే ఇలా ఫిట్ గా ఉంటారు అనేది తెలుసుకోవడం కోసం ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అంతే కాదు అది వాళ్లు కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుని అయితే ఎదురుగానే అడిగేస్తుంటారు. ఏం తింటారండీ బాబు ఇంత అందంగా ఉంటారు అని. అంతే కాదు సూపర్ స్టార్ ఇంటర్వ్యూల్లో కూడా.. మీరు అసలేఏంతింటారు అనే ప్రశ్నలు ఎక్కువగా ఎదురవుతుంటాయి.

మహేష్ అలాంటి విషయాలు చెప్పడం అరుదు. కాని కొన్ని ఇంటర్యూల్లో మాత్రం ఆయన తన ఫుడ్ హ్యాబిడ్స్ గురించి వెల్లడించాడు. అందరు తినేవే తాను తింటానని.. కాకపోతే లిమిట్ గా తింటానంటూ ఓ ఇంటర్వ్యూలో మహేష్ అన్నారు. ఇష్టం కదా అని ఫాటీ ఫుడ్స్ ఎక్కువగా లాంగించేయనన్నారు.. ఇక డైరీ ఫుడ్స్ కాని.. స్వీట్స్ కాని ఫ్యాటీ ఫుడ్స్ కాని ముట్టుకోనంటున్నారు మహేష్.

తాజాగా తను రోజూ ఉదయం తినే బ్రేక్ ఫాస్ట్ గురించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తను బ్రేక్ ఫాస్ట్ తింటున్న ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో(instagram Story) షేర్ చేసి.. ఇది నా డైలీ రొటీన్. రాత్రంతా నానబెట్టిన ఓట్స్, కొన్ని మొలకెత్తిన గింజలు, విత్తనాల్ని కలిపి తీసుకుంటాను. కొన్ని గంటల వరకు నాకు ఇదే పవర్ ని ఇస్తుంది. ఇదే నా బ్రేక్ ఫాస్ట్ అని తెలిపాడు. అలాగే తన న్యూట్రిషనిస్ట్ ల్యూక్ కౌంటినోని ట్యాగ్ చేసి ఒక మంచి న్యూట్రీషియన్ అని చెప్పాడు మహేష్.సూపర్ స్టార్ చెప్పిన బ్రేక్ ఫాస్ట్ సీక్రేట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Updated On 20 July 2023 7:01 AM GMT
Ehatv

Ehatv

Next Story