మరోసారి తన సత్తా చూపించాడు తమిళ స్టార్ హీరో మాధవన్(Madhavan) తనయుడు. ఈసారి ఏకంగా 5 గోల్డ్ మెడల్స్(gold medals) సాధించి రికార్డ్ సృష్టించాడు. పుత్రోత్సాహంలో మునిగి తేలిపోతున్నాడు సౌత్ స్టార్ హీరో.

మరోసారి తన సత్తా చూపించాడు తమిళ స్టార్ హీరో మాధవన్(Madhavan) తనయుడు. ఈసారి ఏకంగా 5 గోల్డ్ మెడల్స్(gold medals) సాధించి రికార్డ్ సృష్టించాడు. పుత్రోత్సాహంలో మునిగి తేలిపోతున్నాడు సౌత్ స్టార్ హీరో.

తండ్రిని మిచిన తనయులు అనే పదం వినే ఉంటారు. ఏరంగంలో అయినా.. తండ్రి ఒక ఫీల్డ్ లో ఉంటే.. అందులో తండ్రిని మించిపోయి.. స్టార్ ఇమేజ్ సాధిస్తే.. ఆతండ్రి పడే సంతోషం అంతా ఇంతా కాదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ చరణ్ ను చూసి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ ను చూసి అరవింద్, మహేష్ బాబును చూసి కృష్ణ.. ఇలా స్టార్స్ అంతా ఎంతో సంతోషించారు.. ఈ స్టార్స్ కూడా వారి తండ్రుల పేర్లు అలానే నిలబెట్టారు. ఈక్రమంలో సౌత్ స్టార్ హీరో మాధవన్ తనయుడు కూడా తన తండ్రి పేరు గట్టిగానే నిలబెడుతున్నారు.

అయితే మధవన్ స్టార్ హీరోగా వెలుగు వెలిగినా.. ఆయన తనయుడు మాత్రం సినిమాల్లోకి రాలేదు. మధవన్(Madhavan) కుమారుడు వేదాంత్(vedaanth) స్పోర్డ్స్ లో తన సత్తా చాటుతున్నాడు. అది కూడా స్విమ్మింగ్ లో.. వరుస రికార్డ్స్ సృష్టిస్తున్నాడు. మాధవన్ కొడుకు వేదాంత్ స్విమ్మింగ్ పోటీల్లో సత్తా చాటుతూ.. మెడల్స్‌ సాధిస్తున్నాడు. ఇక తాజాగా మరోసారి రికార్డు సృష్టించాడు మాధవన్‌ కొడుకు. తండ్రి కళ్లల్ ఆనందం చూశాడు.

గతంలో ఎన్నో మెడల్స్ సాధించిన ఈ కుర్రాడు.. స్విమ్మింగ్‌ పోటీల్లో మరోసారి బంగారు పతకాలు సాధించాడు. మాధవన్‌ కుమారుడు వేదాంత్‌ మలేషియాలో నిర్వహించిన స్విమ్మింగ్‌ పోటీల్లో సత్తా చాటాడు. ఐదు బంగారు పతకాలు సాధించి అదరగొట్టేశాడు. 50, 100, 200, 400, 1500 మీటర్ల విభాగంలో వేదాంత్‌ సత్తా చాటి ఇండియా తరఫున బంగారు పతకాలు సాధించాడు. ఈ విషయాన్ని మాధవన్ స్వయంగా తన సోషల్ మీడియాల శేర్ చేశాడు.

తన కొడుకు సాధించిన ఘనతను గురించి ట్వీట్‌ చేస్తూ.. సంతోషంలో మురిసిపోయాడు మాధవన్‌. ఆనందం తట్టుకోలేకపోతున్నాడు సీనియర్ హీరో. వేదాంత్‌ సాధించిన విజయంతో తనకు పుత్రోత్సాహం కలగడం మాత్రమే కాక.. సంతోషంతో గాల్లో తేలిపోతోన్నట్టుగా ఉంది అంటూ మాధవన్‌ ను చూసి నెటిజన్లు కూడా సంతోషపడుతున్నారు. వేదాంత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తమిళంలో స్టార్ హీరోగా ఎదిగిన మాధవన్.. రొమాంటిక్ హీరో ఇమేజ్ సాధించాడు. అటు బాలీవుడ్ లో కూడా మంచి మంచి సినిమాలు చేశారు మాధవన్.

తెలుగులో తమిళ డబ్బింగ్ సినిమాలతోనే ఫ్యాన్స్ ను సాధించిన మాధవన్.. డైరెక్ట్ గా తెలుగులో అయితే విలన్‌గా ఎంట్రీ ఇచ్చి మెప్పించాడు మాధవన్‌. నాగ చైతన్య సవ్యసాచి సినిమాలో మాధవన్ విలన్‌గా నటించాడు. ఆతరువాత అనుష్క శెట్టి నిశ్శబ్దం సినిమాలోనూ భిన్న పాత్రలో అలరించాడు. ప్రస్తుతం ఆయన ఏ సినిమాలు ఒప్పుకోనట్టు తెలుస్తోంది.

Updated On 18 April 2023 5:39 AM GMT
Ehatv

Ehatv

Next Story