తమిళనాడు స్టార్‌(Tamil Nadu Star) కార్తీ(Karthi)కి బోల్డంత మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. నటనలో వేరియేషన్‌ను చూపించే కార్తీ పొన్నియిన్‌ సెల్వన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విక్రమ్‌, జయంరవి, ఐశ్వర్యరాయ్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, ప్రభు, ప్రకాశ్‌రాజ్‌, విక్రమ్‌ ప్రభు వంటి ప్రముఖ తారాగణం అంతా నటించారు. వీరందరి మధ్యలో కార్తీ వాందియదేవన్‌గా తనదైన శైలిలో నటించారు.

తమిళనాడు స్టార్‌(Tamil Nadu Star) కార్తీ(Karthi)కి బోల్డంత మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. నటనలో వేరియేషన్‌ను చూపించే కార్తీ పొన్నియిన్‌ సెల్వన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విక్రమ్‌, జయంరవి, ఐశ్వర్యరాయ్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, ప్రభు, ప్రకాశ్‌రాజ్‌, విక్రమ్‌ ప్రభు వంటి ప్రముఖ తారాగణం అంతా నటించారు. వీరందరి మధ్యలో కార్తీ వాందియదేవన్‌గా తనదైన శైలిలో నటించారు. మొన్న వచ్చిన పొన్నియిన్‌ సెల్వన్‌ -2 సినిమా సూపర్‌హిట్టయింది. మద్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఏ.ఆర్‌.రెహమాన్‌ మ్యూజిక్‌, రవి వర్మన్‌ ఫోటోగ్రఫీ అదనపు ఆకర్షణగా నిలిచాయి. రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ గత నెల 28న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఈ సినిమా జపాన్‌లోనూ విడుదలయ్యి హిట్‌టాక్‌ను సాధించింది. ఈ సినిమాను చూసిన జపాన్‌వాసులు కార్తీ నటనకు ముగ్దులయ్యారు. కార్తీని చూసేందుకు చెన్నైకు వచ్చారు. వీరు కార్తీ కోసమే ఆ సినిమాను నాలుగు సార్లు చూశారట! విషయం తెలుసుకున్న కార్తీ వారిని తన ఇంటికి పిలుపించుకున్నారు. వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా కార్తీ కోసమని జపాన్‌ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన కానుకలను ఆయనకు అందించారు. కార్తీతో కలిసి ఫోటోలు దిగారు. జపాన్‌లో రజనీకాంత్‌కే అనుకున్నాం.. కార్తీకి కూడా హార్డ్‌కోర్‌ ఫ్యాన్స్‌ ఉంటారని ఇప్పుడే తెలిసింది. !

Updated On 3 May 2023 12:04 AM GMT
Ehatv

Ehatv

Next Story