గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం (Maniratnam)తో తనకున్న బాండింగ్ గురించి గ్రేట్ యాక్టర్ కమల్‏హాసన్ షేర్ చేసుకున్నారు. మణిరత్నం 67వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకున్న బంధాన్ని వివరిస్తూ బర్త్ డే విషెస్ చెప్పారు. బ్లాక్ బస్టర్లు, మంచి గుర్తింపు తెచ్చుకున్న సినిమాలను అందించిన ఘనత మణిరత్నానికే దక్కుతుందని తెలిపారు.

గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం (Maniratnam)తో తనకున్న బాండింగ్ గురించి గ్రేట్ యాక్టర్ కమల్‏హాసన్ షేర్ చేసుకున్నారు. మణిరత్నం 67వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకున్న బంధాన్ని వివరిస్తూ బర్త్ డే విషెస్ చెప్పారు. బ్లాక్ బస్టర్లు, మంచి గుర్తింపు తెచ్చుకున్న సినిమాలను అందించిన ఘనత మణిరత్నానికే దక్కుతుందని తెలిపారు.

ది గ్రేట్ డైరెక్టర్ బర్త్ డే సందర్భంగా కమల్ హాసన్ (Kamal Haasan) తన మనసులో మాటలను పంచుకున్నారు. అయితే వారిద్దరూ కలిసున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘ఒక వ్యక్తి తన చుట్టూ సృష్టించే ఆనందాన్ని బట్టి జీవితాన్ని లెక్కించినట్లయితే.. మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఏజ్‏ను లెక్కిస్తే.. నా ప్రియమైన #మణిరత్నం మీరు ఈరోజు చాలా పెద్ద మనిషి అవుతారు. తన కళ ద్వారా లక్షలాది మంది హృదయాలను హత్తుకున్న భారతీయ సినిమా దిగ్గజమని, డైలాగ్‏లను మనోహరమైన దృశ్యానుభవంగా మార్చిన వ్యక్తి మణిరత్నం’’ అని రాశారు.

నిరంతరం నేర్చుకుని సవాలు రేంజ్‏ని పట్టించుకోకుండా మీరు సినిమా సరిహద్దులను నిరంతరం ముందుకు నడిపించారన్నారు. ఈరోజు మీరు మీ లెగసీని నెక్ట్‏జెనరేషన్ వాళ్లకు స్పూర్తినిస్తున్నాయన్నారు. నాయకుడు నుంచి #KH234 వరకు వాళ్లిద్దరి ప్రయాణం పర్సనల్‏గా బావుందని అన్నారు. ప్రతీ రోజు సంతోషంగా ఉండాలని నా స్నేహితుడికి #HappyBirthdayManiRatnam
అని ట్విటర్‏లో లేఖ రాసుకున్నారు కమల్‏హాసన్.

ఇక మణిరత్నం (Maniratnam), కమల్ హాసన్ (Kamal Haasan) కాంబినేషన్‏లో KH234 విషయానికి వస్తే.. అంతకంటే ముందు మణిరత్నం-కమల్ హాసన్ కాంబినేషన్‏లో 1987లో వచ్చిన నాయకుడు ఏ రేంజ్‏లో హిట్ అయిందో మనందరికి తెలుసు. దాదాపు 35ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోతో KH234 అనౌన్స్‏మెంట్ రావడంతో అందరూ ఎగ్జయిట్ అవడంతోపాటు ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో హీరోయిన్‏గా నయనతార (Nayanthara) నటిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అఫిషియల్ అనౌన్స్‏మెంట్ రావాల్సి ఉంది.

మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్, ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు కొద్దిరోజుల్లో రానున్నాయి.

Updated On 2 Jun 2023 11:14 PM GMT
Ehatv

Ehatv

Next Story