సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‏లోనూ సూపర్ స్టార్ ధనుష్‏(Dhanush)కు మంచి గుర్తింపు ఉంది. అసురన్, వాతి, వేలైఇల్లా పట్టదారి, తిరు, వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన ఆయన నాలుగు సార్లు నేషనల్ అవార్డులను కూడా తన సొంతం చేసుకున్నాడు. ఇవాళ ఆయన ముంబై ఎయిర్ పోర్టు (Mumbai airport)లో రఫ్ లుక్‏లో కనిపించడంతో ఫొటోలు క్లిక్ మనిపించారు. రగ్గ్‏డ్‏గా గుబురు గడ్డం, లాంగ్ హెయిర్‏తో కొత్త లుక్‏తో కనిపించి అందరినీ ఆకర్షించాడు ధనుష్. పింక్ కలర్ స్వెట్ షర్ట్, బ్లాక్ ట్రాక్ ప్యాంట్ వేసుకుని ట్రావెల్ లుక్‏లో ఉన్నాడు ధనుష్. వాతీ యాక్టర్ రౌడీ లుక్‏లో బ్లాక్ సన్ గ్లాసెస్‏తో అదరగొట్టేశాడు.

అయితే ఈ కొత్త లుక్ ఆయన నెక్ట్స్ సినిమా కోసమే అంటున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ (Captain Miller ) చిత్రం నుంచి ఓ పోస్టర్ రిలీజ్ అయింది. అందులో ఆయన గడ్డంతో చేతిలో తుపాకీ పట్టుకుని దుమ్ములో ఉన్న పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఆ పోస్టర్ మంచి రెస్పాన్స్‏ను అందుకుంది. ఇక ధనుష్ సార్ చిత్రంతో టాలీవుడ్‏కు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

ధనుష్ ప్రస్తుతం అరుణ్ మాథేశ్వరణ్ దర్శకత్వంలో కెప్టెన్ మిల్లర్ (Captain Miller) అనే సినిమా చేస్తున్నాడు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్(Shiva Rajkumar), సందీప్ కిషన్ (Sundeep Kishan) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) హీరోయిన్‏గా నటిస్తుండగా.. జాన్ కొక్కెన్, నివేదితాసతీష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అర్జున్ త్యాగరాజన్, సెంథిల్ త్యాగరాజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ లుక్ పోస్టర్‏ను జూన్‏లో విడుదల చేస్తామని, టీజర్‏ను జులైలో రిలీజ్ చేస్తామని మేకర్స్ రీసెంట్ గానే ప్రకటించారు.

అలాగే తెలుగులోనూ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కల్ట్ క్లాసిక్ కర్ణన్ చిత్రం తర్వాత మారి సెల్వరాజ్‏తో మరో సినిమా చేయనున్నాడు ధనుష్. అండ్ అలాగే వెట్రిమారన్ దర్శకత్వంలో మెస్ట్ ఎక్సైటెడ్ ‘వడ చెన్నై’ సీక్వెల్ పార్ట్ 2కి కూడా రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.

Updated On 29 May 2023 8:40 AM GMT
Ehatv

Ehatv

Next Story