ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీ బేబీ. సాయి రాజేష్ దర్శకత్వంలో SKN నిర్మాణంలో రూపొందిన ఈసినిమా జులై 14న రిలీజ్ అయ్యింది. ఎటువంటి అంచనాలులేకుండా.. సైలెంట్ గా రిలీజ్ అయ్యి.. సెన్సేషనల్ హిట్ సాధించింది. ఎక్కడ చూసినా. బేబీ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు జనాలు. చాలా చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన బేబీ సినిమా నాన్ స్టాప్ రన్ తో.. బాక్సాఫీస్ దగ్గర 75 కోట్ల కలెక్షన్స్ ని సాధించింది. ఒక మోస్తరు స్టార్ హీరో సాధించే కలక్షన్స్ ను సాధించిందీ మూవీ.

సినిమా నచ్చడంత సెలబ్రిటీ స్టార్లు కూడా ప్రత్యేకంగా ఈవెంట్లు పెట్టి మరీ.. అభినందిస్తున్నారు. ఈమధ్య అల్లు అర్జున్(allu arjun)... ఈసినిమాకోసం అభినందన సభ పెట్టి మరీ.. సినిమాపై నిర్మాతపై... దర్శకుడిపై ప్రశంసలుకురిపించాడు. చిత్ర యూనిట్ అభినందించారు. తాజాగా .. మెగాస్టార్ చిరంజీవి కూడా బేబీ మూవీ టీమ్ పై ప్రశంసలుకురిపించారు. బేబీ మూవీ విజయోత్సవ సభలో...మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సందడి చేశారు. ఆయన మాట్లాడుతూ... ఇప్పటి యువతకి మాత్రమే కాదు, ఇప్పటి పేరెంట్స్ కి కూడా ఒక మెసేజ్ లాంటింది అన్నారు. ముందుగా వారికే ఇలాంటి మెసేజ్ అందాలి అన్నారు.
. ఈ జనరేషన్ యువత ఫోన్ కు బాగా అడిక్ట్ అయ్యారు.. సోషల్ మీడియా ప్రపంచంలోనే బ్రతుకుతున్నారు. ఈ క్రమంలో అనేక సమస్యల్లో పడుతున్నారు. ఒక బలహీనమైన క్షణంలో తెలిసో, తెలియకో చిన్న వయసులోనే తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులను ఎలా సరిదిద్దుకోవాలో తెలియక బయపడి ఆత్మహత్య వరకు వెళ్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న యూత్ ధైర్యంగా ఆ సమస్యని ఎదురుకోవాలంటే పేరెంట్స్ హెల్ప్ కూడా కావాలి అన్నారు మెగాస్టార్ చిరంజీవి.
చిన్న వయసులో ఉన్న పిల్లలు చిన్న తప్పుని కూడా హ్యాండిల్ చేయలేరు. ఆ తప్పు ఎక్కడ పేరెంట్స్ కి తెలిస్తే తిడతారో అనే భయం కలిగి.. సమస్యని తమలోని ఉంచుకొని ఆత్మహత్య వరకు వెళ్తున్నారు. అలా కాకుండా ప్రతి పేరెంట్.. తమ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటూ, వారి ప్రతి విషయాలను తెలుసుకుంటూ, వచ్చే సమస్యలు గురించి ముందుగానే పిల్లలకి స్నేహ భావంగా చెబుతూ ఉండడంతో.. పిల్లల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కరికి ఇదొక ఎడ్యుకేటెడ్ మూవీ అంటూ ప్రశంసలు కురిపించారు చిరంజీవి.