నందమూరి బాలకృష్ణ(Nandhamuri Balakrishna) హీరోగా దర్శకుడు అనిల్‌ రావిపూడి(Anil Ravipudi) తెరకెక్కిస్తున్న చిత్రం భగవంత్‌ కేసరి(Bhagavanth Kesari).. విజయదశమి పండుగ కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలన్నది చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.

నందమూరి బాలకృష్ణ(Nandhamuri Balakrishna) హీరోగా దర్శకుడు అనిల్‌ రావిపూడి(Anil Ravipudi) తెరకెక్కిస్తున్న చిత్రం భగవంత్‌ కేసరి(Bhagavanth Kesari).. విజయదశమి పండుగ కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలన్నది చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. సహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఇందులో కాజల్‌(Kajal Aggarwal) హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో శ్రీలీల(Sreeleela) కనిపించబోతున్నారు. అర్జున్‌ రాంఫాల్‌(Arjun Ramphal) విలన్‌గా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబద్‌లో జరుగుతోంది. ప్రత్యేకంగా రెడీ చేసిన భారీ సెట్‌లో బాలకృష్ణపై ఓ హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. దీనికి వెంకట్‌ మాస్టర్‌(Venkat Master) నేతృత్వం వహిస్తున్నారు. మరో పది రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. ఆ తర్వాత బాలకృష్ణపై ఓ పాట చిత్రీకరించనున్నారు. వచ్చే నెలాఖరులకల్లా సినిమా పూర్తి చేయాలన్నది టార్గెట్‌గా పెట్టుకన్నారు. మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న కోణాలున్న పాత్రలో కనిపించబోతున్నారు.

Updated On 15 July 2023 1:56 AM GMT
Ehatv

Ehatv

Next Story