తన ఫ్యాన్స్ ను అలరించడానికి బాలయ్య బాబు ఏం చేయడానికైనా రెడీ అంటున్నాడు. వయస్సుతో సబంధం లేకుండా.. ఉరకలు వేస్తున్న ఉత్సాహాన్ని సినిమాల కోసం ఉపయోగిస్తున్నారు నందమూరి హీరో. అంతే కాదు అభిమానులను అలరించడానికి ఏ సాహసం చేయడానికైనా సై అంటున్నాబు బాలయ్య.. మంచి జోరు మీద ఉన్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ . వరుసగా సినిమాలు సెట్స్ ఎక్కిస్తున్నాడు.

ఆరు పదుల వయస్సులో కూడా ఏమాత్రం తగ్గడంలేదు బాలయ్య బాబు(Balayya Babu). అభిమానులను అలరించడానికి కొత్తగా ఏం చేయడానికైనా రెడీ అంటున్నాడు. ఇంతకీ బాలయ్య ఏం చేయబోతున్నారంటే..?

తన ఫ్యాన్స్ ను అలరించడానికి బాలయ్య బాబు ఏం చేయడానికైనా రెడీ అంటున్నాడు. వయస్సుతో సబంధం లేకుండా.. ఉరకలు వేస్తున్న ఉత్సాహాన్ని సినిమాల కోసం ఉపయోగిస్తున్నారు నందమూరి హీరో. అంతే కాదు అభిమానులను అలరించడానికి ఏ సాహసం చేయడానికైనా సై అంటున్నాబు బాలయ్య.. మంచి జోరు మీద ఉన్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ . వరుసగా సినిమాలు సెట్స్ ఎక్కిస్తున్నాడు. 60 ఏళ్ల వయస్సులో.. 30 ఏళ్ల కుర్రాడిలా దూకుడు చూపిస్తున్నాడు. ఒకవైపు సినిమాలు.. మరో వైపు రాజకీయాలు రెండింటిని బ్యాలన్స్ చేస్తూ.. అటు తన బిజినెస్ పనులు కూడా చూసుకుంటూ.. బిజీగా గడిపేస్తున్నాడు బాలయ్య. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి(anil Ravipudi) డైరెక్షన్ లో భగవంత్ కేసరి(Baghavanth Kesari) సినిమాలో నటిస్తున్నాడు బాలయ్య. ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న భగవంత్ కేసరి... సినిమా I Don’t Care ట్యాగ్ లైన్ తో రూపొందుతోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన మొదటి సారి కాజల్ అగర్వాల్(kajal aggarwal) హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక భగవంత్ కేసరి సినిమా గురించిన క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా గురించి వినిపిస్తోన్న లేటెస్ట్ హాట్ న్యూస్ ఏంటీ అంటే.. ఈ సినిమా కోసం బాలయ్య ఓ సాహసం(stunts) చేయబోతున్నారట. బాలయ్య సినిమా అంటే పాటలు లేకుండా ఉండదు. ఈ ఏజ్ లో కూడా ఆయన కుర్ర హీరోలతో పాటు పోటీ పడుతూ స్టెప్పుటేస్తారు. లక్ష్మీ నరసింహ, లెజెండ్ , అఖండ లాంటి సినిమాల్లో ఆయన ఊపు తెలిసిందే.. ఈ క్రమంలో ఈసారి కూడా భగవంత్ కేసరి సినిమాలో డాన్స్ వేరే లెవల్లో ఉండబోతోందట. ఈసారి బాలయ్య ఫ్యాన్స్‌ని ఖుషీ చెయ్యడానికి సాంగ్స్‌ని భారీగా డిజైన్ చేస్తున్నారట.

‘భగవంత్ కేసరి’ మూవీలో ఓ పాటలో బాలయ్య చేత ఏకంగా ఫ్లోర్ స్టెప్(floor Steps) వేయించాలనుకున్నాడట డైరెక్టర్. బాలయ్యకి తన ఆలోచన చెప్పడం, ఆయన వెంటనే ఒకే అనేసి.. గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. అంతే కాదు 10 రోజుల పాటు ప్రాక్టీస్ చేయడం కూడా జరిగిందట. ‘బాలయ్య ఫ్లోర్ మూమెంట్ వేస్తే ఎలా ఉంటుంది?, థియేటర్లు దద్దరిల్లిపోతాయ్.. జస్ట్ ఇమాజిన్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. ఈసినిమాలో బాలయ్య వయసు తగ్గ పాత్రలో కనిపించనున్నారు. యంగ్ ఏజ్‌లో జైలుకెళ్లి, వయసుపైబడ్డాక విడుదలై బయటకు వచ్చే క్యారెక్టర్ అని తెలుస్తుంది. అందుకు తగ్గట్టే బాలయ్య గెటప్, కాస్ట్యూమ్స్ అన్నీ సరికొత్తగా ఉన్నాయి. ఆయన మార్క్ సీరియస్ యాక్షన్‌తో పాటు తన స్టైల్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు అనిల్.. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహూ గారపాటి – హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Updated On 20 July 2023 6:35 AM GMT
Ehatv

Ehatv

Next Story