ఇదిగో అదిగో అంటున్నారే తప్ప నందమూరి మోక్షజ్ఞ(nandhamuri mokshagna) సినిమా ఎప్పుడో చెప్పడం లేదు.

ఇదిగో అదిగో అంటున్నారే తప్ప నందమూరి మోక్షజ్ఞ(nandhamuri mokshagna) సినిమా ఎప్పుడో చెప్పడం లేదు. ఎప్పుడో హీరోగా తెరంగ్రేటం చేయాల్సింది. కాకపోతే సరైన కథ, సరైన దర్శకుడు దొరకడం లేదు కాబోలు! బాలకృష్ణ(Balakrishna) ఎన్నో కథలు విన్నారట! ఏదీ ఆయనకు నచ్చలేదట! ఆ మధ్యన మోక్షజ్ఞ ఫోటో చూసి అభిమానులు బిత్తర పోయారు. ఏమిటిలా ఉన్నాడని గుసగుసలాడుకున్నారు. అయితే మోక్షజ్ఞ చాలా పట్టుదలతో మేకోవర్‌(Make over) అయ్యాడు. ఇప్పుడతడిని చూస్తే అచ్చంగా హీరోలాగే ఉన్నాడు. బాలకృష్ణకు ఇప్పుడు తీరిక దొరికింది. కూతుళ్లిద్దరూ వెల్‌ సెటిల్డ్‌. బాలయ్యకు వరుస సినిమాలు ఉన్నా పెద్దగా బరువు బాధ్యతలు లేవు. ఉన్నదల్లా కొడుకును హీరో చేయ్యడమే! కొడుకును హీరోగా పెట్టి సినిమా తీయడం బాలయ్యకు పెద్ద కష్టమైన పనేమీ కాదు. కాకపోతే చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మంచి సబ్జెక్ట్‌ దొరకాలి. దాన్ని హ్యాండిల్‌ చేసే దర్శకుడు దొరకాలి. మరీ ముఖ్యగా ఏ జానర్‌లో తీయాలన్నది డిసైడ్‌ చేసుకోవాలి. అందుకే తొందరపడి ఓ నిర్ణయం తీసుకోవడం లేదు బాలయ్య. ఏది ఏమైనా రాబోయే ఆరు నెలల్లో మోక్షజ్ఞ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తున్నది.

Eha Tv

Eha Tv

Next Story