2023లో వరుస హిట్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు నందమూరి నట సింహం.. టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో నంద‌మూరి బాలకృష్ణ(Bala krishna). ఇక ముందు ముందు కూడా ఇలా హిట్లు కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. మరోసారి బ్లాక్ బస్టర్(Block buster) ను లైన్ లో పెట్టాడు బాలకృష్ణ. ఇక బాలయ్య తాజాగా న‌టిస్తున్న సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. బాలయ్య నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ NBK 109.

2023లో వరుస హిట్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు నందమూరి నట సింహం.. టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో నంద‌మూరి బాలకృష్ణ(Bala krishna). ఇక ముందు ముందు కూడా ఇలా హిట్లు కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. మరోసారి బ్లాక్ బస్టర్(Block buster) ను లైన్ లో పెట్టాడు బాలకృష్ణ. ఇక బాలయ్య తాజాగా న‌టిస్తున్న సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. బాలయ్య నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ NBK 109. ఎప్ఫుడూ.. మెగా హీరోలతో సినిమాలు చేసే బాబీ.. ఈసారి మాత్రం నందమూరి నటసింహంతో సినిమాకు సై అన్నాడు. వాల్తేరు వీరయ్యతో(waltair veerayya) ఈ ఏడాది బ్లాక్ బస్టర్ అందుకున్నాడు బాబీ.

ఇక తాజాగా ఈమూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి.. సూపర్ ఫాస్ట్ గా సాగుతోంది. ఇక ఈమూవీకి సంబంధించి ఓ న్యూస్ వైరల్(Viral) అవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. బాబీ(Bobby) తీసే ప్రతీ సినిమాల‌లో ఒక ప్ర‌త్యేక‌ ఐటమ్ సాంగ్​(Item Song) ఉంటుందన్న విష‌యం తెలిసిందే. బాబీ గతంలో ఎన్టీఆర్​తో జై లవకుశ సినిమా చేయ‌గా.. ఈ మూవీలో స్వింగ్ జర ఐటమ్ సాంగ్ ఒక రేంజ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. దీని త‌ర్వాత రీసెంట్‌గా వ‌చ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ సాంగ్ కూడా సూపర్ హిట్‌గా నిలిచింది.

అయితే తాజాగా వ‌స్తున్న ఎన్​బీకే 109 సినిమాలో కూడా బాబీ ఒక ఐటమ్ సాంగ్​ ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఇక ఈ సాంగ్ కోసం మిల్కీ బ్యూటీ తమన్నాను(Milky beauty Tamanna) సంప్ర‌దించిన‌ట్లు టాక్. దీనిపై తమన్నా కూడా ఓకే చెప్పిన‌ట్లు స‌మాచారం. సితార బ్యానర్​పై సూర్యదేవర నాగవంశీ, ఎస్‌.సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అయితే ఈ మూవీలో మలయాళ స్టార్ దుల్కర్(Dulquer ) కూడా నటిస్తున్నట్టు సమాచారం. అయితే న‌ట సింహం బాలకృష్ణతో దుల్కర్ సల్మాన్ కలిసి వెండితెరపై కనిపిస్తే ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Updated On 18 Dec 2023 7:00 AM GMT
Ehatv

Ehatv

Next Story