కన్నడ నుంచి యాక్టర్ గా ఎదిగి.. తమిళ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగాడు అర్జున్. సౌత్ లోని అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ.. యాక్షన్ కింగ్ ఇమేజ్ ను సాధించాడు అర్జున్(Arjun). తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వరుస సినిమాలు.. సూపర్ హిట్ సినిమాలు చేసిన అర్జున్ 60 ఏళ్లు దాటినా కూడా ఇంకా హీరోగా చేస్తూనే... క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ వస్తున్నాడు.

సౌత్ స్టార్ సీనియర్ హీరో.. యాక్షన్ కింగ్ అర్జున్(Arjun) కూతురు ఐశ్వర్య అర్జున్(Aishwarya Arjun) పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఇంతకీ ఈ వార్తలో నిజమెంత. అర్జున్ కూతురు చేసుకోబోయేది ఎవరిని..?

కన్నడ నుంచి యాక్టర్ గా ఎదిగి.. తమిళ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగాడు అర్జున్. సౌత్ లోని అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ.. యాక్షన్ కింగ్ ఇమేజ్ ను సాధించాడు అర్జున్(Arjun). తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వరుస సినిమాలు.. సూపర్ హిట్ సినిమాలు చేసిన అర్జున్ 60 ఏళ్లు దాటినా కూడా ఇంకా హీరోగా చేస్తూనే... క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ వస్తున్నాడు. ఈక్రమంలో.. ఆయన వారసురాలిగా.. అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

కన్నడ, తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది ఐశ్వర్య అర్జున్. అంతే కాదు తెలుగులో కూడా విశ్వక్ సేన్(Vishwak sen) హీరోగా ఓ సినిమా స్టార్ట్ అయ్యింది. కాని అర్జున్ కు విశ్వక్ కు మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా ఈ సినిమా ఆగిపోయింది. ఈక్రమంలో ఆమె టాలీవుడ్ ఎంట్రీ జరగలేదు. ఇక తాజా సమాచారం. ప్రకారం అర్జున్ కూతురు పెళ్లి పీటలు ఎక్కబోతుందట. తాను ప్రేమించిన కుర్రాడినే పెళ్లి చేసుకోబోతుదంట. అంతే కాదు అతను కూడా ఇండస్ట్రీకి(Industry) చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. త్వరలో ఈ పెళ్ళికి సబందించిన ప్రొసీజర్ స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది.

సినీ ఇండస్ట్రీకి చెందిన కమెడియన్ గా స్టార్ డమ్ సంపాదించుకున్న తంబి రామయ్య(Thambi Ramaiah) కుమారుడు ఉమాపతితో(Umapathi) ఐశ్వర్య పెళ్ళికి సన్నాహాలు జరగబోతుందని తెలుస్తోంది. గత కొంతకాలంగా ఐశ్వర్య ఉమాపతితో ప్రేమలో ఉన్నట్టు సమాచారం.తంబి రామయ్య తనయుడు ఉపాపతి కూడా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా సినిమాలు టీవీ షో లతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఉమాపతితో ఐశ్వర్య వివాహం జరగబోతుందన్న వార్త సంచలనంగా మారింది. కాని ఇంత వరకూ ఈ విషయంలో ఇరు ఫ్యామిలీలు స్పందించలేదు.

ఇక ఉపాపతి, ఐశ్వర్య ప్రేమించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ న్యూస్ ను ఇరు కుటుంబాలు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. త్వరలో చేస్తారన్న న్యూస్ చెన్నై సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. మరి ఈ న్యూస్ నిజమా కాదా అనేది తెలియాలి అంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేవరకూ ఆగాల్సిందే.

Updated On 27 Jun 2023 11:44 PM GMT
Ehatv

Ehatv

Next Story