పుష్ప-2 రిలీజ్ డేట్‌పై బన్నీక్లారిటీ
మారుతినగర్ సుబ్రమణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న అల్లు అర్జున్(Allu arjun) ఇప్పటివరకు ఉన్న అన్నిఅనుమానాలను పటాపంచలు చేశాడు. నిన్నటి వేడుకలో బన్నీమూడు విషయాల్లో ఫ్యాన్స్‌కు ఉన్న సందేహాలను తీర్చాడు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అల్లు అర్జున్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YSRCP) అభ్యర్థికి మద్దతుగా ప్రచారానికి వెళ్లారు. అప్పుడు మెగా ఫ్యాన్స్‌కు పలు విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్(Pawan kalyan) పోటీ చేస్తున్న పిఠాపురానికి(Pithapuram) వెళ్లడానికి టైమ్ లేదు కానీ వైసీపీ అభ్యర్థి కోసం మాత్రం టైమ్ దొరుకుతుందా అని నిలదీశారు. ఇప్పుడు దాని ఊసు ఎవరూ ఎత్తడం లేదనుకోండి. ఇక దర్శకుడు సుకుమార్‌తో బన్నీకి విభేదాలు వచ్చాయని, పుష్ప -2(Pushpa-2) ఆలస్యమవ్వడానికి ఇదే కారణమని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. వీటితో పాటు పుష్ప-2 సినిమా ఎప్పుడు రిలీజవుతుందో తెలియక ఫ్యాన్స్ అయోమయపడుతున్నారు. అయితే ఈ మూడు విషయాలపై బన్నీ క్లారిటీ ఇచ్చేశాడు. తనకు నచ్చితే, తాను ఇష్టపడితే, అండగా నిల్చోవడానికి, ఎక్కడికైనా వెళ్లడానికి తాను వెనుకాడను అని చెప్పిన బన్నీ వైసీపీ అభ్యర్థి కోసం ప్రచారానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందన్నది మూడు ముక్కల్లో చెప్పేశాడు. నమ్మిన వారి కోసం, స్నేహం చేసిన వారి కోసం, ఎదుటివారు ఏమనుకుంటారోనన్న ఫీలింగ్‌ను పక్కన పెట్టేసి, సమస్యలు ఎదురవుతాయేమోనన్న భయాన్ని వదిలేసి ధైర్యంగా ముందుకు వెళ్లేవాడు గొప్పవాడు అవుతాడు. ఆ లెక్కన బన్నీ గొప్పోడే! ఇక పుష్ప-2 రిలీజ్ డేట్‌ను కూడా బన్నీ అనౌన్స్ చేశాడు. డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నదని వేదిక మీదనే, అదికూడా సుకుమార్ పక్కనే ఉన్నప్పుడు చెప్పాడు. సుకుమార్ దీన్ని కాదనలేదు కాబట్టి డిసెంబర్ 6వ తేదీ పక్కా అనే అనుకోవచ్చు. ఇక తనకు సుకుమార్‌తో ఎలాంటి విభేదాలు లేవని సుకుమార్‌ను ఆలింగనం చేసుకోవడం ద్వారా రుజువు చేశాడు. సో.. అన్ని విషయాలపై బన్నీక్లారిటీ ఇచ్చేశాడనే అనుకోవాలి!