ఒకప్పటి హ్యాండ్సమ్ హీరో అబ్బాస్ ఇప్పుడు ఏమయ్యాడు.. చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. మంచి కలర్ పర్సనాలిటీ.. అమ్మాయిలు చూడగానే చివుక్కుమనే అందంతో.. అబ్బబాస్ ఉండేవాడు. అందుకే ఆయన అప్పట్లోనే లవర్ బాయ్ ఇమేజ్ తో పాటు మంచి క్రేజ్ కూడా తెచ్చుకున్నాడు హీరోగానే కాదు విలన్ గాను నటించి మెప్పించాడు అబ్బాస్. 2015 తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో కలిసి న్యూజిలాండ్(New Zealand) లో సెటిల్ అయ్యారు. ఇన్నాళ్ల తర్వాత ఆయన ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ రావడానికి ట్రై చేస్తున్నారు అబ్బాస్.

తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేసి.. లవ్వర్ బాయ్ అనిపించుకున్నాడు అబ్బాస్(Abbas). దాదాపు 50 సినిమాలు చేసిన తరువాత అవకాశాలు తగ్గి ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. అప్పట్లో హ్యాండ్సమ్ హీరోగా అమ్మాయిల కలల రాజకుమారుడు అనిపించుకున్నాడు ఇప్పుడు అబ్బాస్ ఎలా ఉన్నారు అని చాలా మంది నెటిజన్స్ వెతుకుతున్నారు. గూగుల్ తల్లిని కూడా అడుగుతున్నారు.

ఒకప్పటి హ్యాండ్సమ్ హీరో అబ్బాస్ ఇప్పుడు ఏమయ్యాడు.. చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. మంచి కలర్ పర్సనాలిటీ.. అమ్మాయిలు చూడగానే చివుక్కుమనే అందంతో.. అబ్బబాస్ ఉండేవాడు. అందుకే ఆయన అప్పట్లోనే లవర్ బాయ్ ఇమేజ్ తో పాటు మంచి క్రేజ్ కూడా తెచ్చుకున్నాడు హీరోగానే కాదు విలన్ గాను నటించి మెప్పించాడు అబ్బాస్. 2015 తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో కలిసి న్యూజిలాండ్(New Zealand) లో సెటిల్ అయ్యారు. ఇన్నాళ్ల తర్వాత ఆయన ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ రావడానికి ట్రై చేస్తున్నారు అబ్బాస్.

అయితే అబ్బాస్ ఓ టాయిలెట్ క్లీనర్(Toilet Cleaner) యాడ్ లో నటించడం అప్పట్లో అందరిని ఆశ్చర్యనికి గురి చేసింది. ఈ విషయంలోఆయన పై చాలా విమర్శలు కూడా వచ్చాయి. క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న అబ్బస్ ఇలా టాయిలెట్ క్లినర్ లిక్విడ్ కు సంబంధించిన యాడ్ లో నటించడంతో ఆయనను చాలా మంది విమర్శించారు. అయితే తాజాగా దీని పై స్పందించారు అబ్బాస్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ యాడ్ పై నటించడం గురించి మాట్లాడారు.

పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకే తాను ఆ ప్రకటనలో నటించినట్టు తెలిపారు. ఆ యాడ్ తర్వాత తనను వెక్కిరిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు చేశారని, అయినా అవేవీ తనను బాధపెట్టలేదన్నారు. ఆ యాడ్ వచ్చినప్పుడు తాను బిజీగా లేనని, వాళ్లు తనకు 8 సంవత్సరాల కాంట్రాక్ట్ ఇవ్వడంతోపాటు మంచి రెమ్యునరేషన్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. అలా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకున్నానని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. త్వరలో అబ్బాస్ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఇండియాకు వచ్చేసిన అబ్బాస్.. విదేశాల్లో ఉండగా..మేకానిక్ గా.. డ్రైవర్ గా చాలా ఇబ్బందులు పడ్డారు. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం చాలా కష్టపడ్డాడు.

Updated On 6 Aug 2023 5:48 AM GMT
Ehatv

Ehatv

Next Story