అతి త్వరలో బిగ్‌బాస్‌ -7(Bigg Boss) సీజన్‌ షో ప్రారంభం కానుంది. వచ్చే నెల 3వ తేదీన బిగ్‌బాస్‌ షోను గ్రాండ్‌గా ప్రారంభించడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. కంటెస్టెంట్ల ఎంపిక సరిగా లేకపోవడం వల్లే గత సీజన్లు కొన్ని ప్రేక్షకులను మెప్పించలేదన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మేకర్స్‌ ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

అతి త్వరలో బిగ్‌బాస్‌ -7(Bigg Boss) సీజన్‌ షో ప్రారంభం కానుంది. వచ్చే నెల 3వ తేదీన బిగ్‌బాస్‌ షోను గ్రాండ్‌గా ప్రారంభించడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. కంటెస్టెంట్ల ఎంపిక సరిగా లేకపోవడం వల్లే గత సీజన్లు కొన్ని ప్రేక్షకులను మెప్పించలేదన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మేకర్స్‌ ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రేక్షకులకు బాగా తెలిసినవారినే కంటెస్టెంట్లుగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. లేటెస్ట్‌గా ఎవరూ ఊహించని ఇద్దరి పేర్లు తెరమీదకు వచ్చాయి. ఒకప్పటి హీరో అబ్బాస్‌(Abbas), హీరోయిన్‌ ఫర్జానా(Farzana) కూడా బిగ్‌బాస్‌ హౌస్‌లోని వెళుతున్నారని తెలిసింది. ప్రేమదేశం సినిమాతో తెలుగువారికి కూడా అబ్బాస్‌ పరిచయం అయ్యారు. తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న అబ్బాస్‌ తర్వాత నటనకు గుడ్‌బై చెప్పి కుటుంబంతో పాటు న్యూజిలాండ్‌కు వెళ్లిపోయాడు. తాజాగా ఫ్యామిలీతో పాటు ఆయన ఇండియాకు తిరిగి వచ్చారు.

మళ్లీ సినిమా అవకాశాలు వస్తే నటించడానికి రెడీగా ఉన్నానని పలు ఇంటర్వ్యూలలో అబ్బాస్‌ చెప్పిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే అబ్బాస్‌ బిగ్‌బాస్‌కు వెళ్లాలని అనుకుంటున్నారు. ఇప్పటికే తెలుగులో పలు యూట్యూబ్‌ ఛానెల్స్‌కు అబ్బాస్‌ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ విధంగా తెలుగువారికి మళ్లీ దగ్గరవుతున్నారు. ఆయనతో పాటు హీరోయిన్‌ ఫర్జానా కూడా బిగ్‌బాస్‌లో పాల్గొనడం ఖరారయ్యిందట! భాగ్యలక్ష్మి బంపర్‌ డ్రా సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయిన ఫర్జానా ఆ తర్వాత సీమశాస్త్రి, బొమ్మన బ్రదర్స్‌ చందన సిస్టర్స్‌, 1977, కుబేరులు వంటి సినిమాలలో నటించారు. 2009 తర్వాతామె టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్నారు ఈ ముంబాయి భామ. తాజాగా బిగ్‌బాస్‌ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలని ఆమె అనుకుంటున్నారట! ఫర్జానా అద్భుతమైన డ్యాన్సర్‌ కూడా! బాలీవుడ్‌లో పలు ప్రైవేటు ఆల్బమ్స్‌కు కొరియోగ్రాఫర్‌గా కూడా వ్యవహరించారు. హీరో హోండా, సన్ సుయ్, గోద్రెజ్ హెయిర్ కేర్, బిగ్ బజార్ వంటి ప్రముఖ సంస్థలకు ఆమె ప్రచారకర్తగా కూడా పనిచేశారు.

Updated On 23 Aug 2023 7:32 AM GMT
Ehatv

Ehatv

Next Story