రాజస్తాన్‌లోని(Rajasthan) ఉదయ్‌పూర్‌లో(Udaypur) అమీర్‌ఖాన్‌(Aamir Khan) కూతురు ఇరాఖాన్(Ira Khan) పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. తన కూతురు ప్రేమించిన నుపుర్‌శిఖరేకు(Nupur Shikhare) ఇచ్చి అమీర్‌ అంగరంగవైభవంగా వివాహం జరిపించారు.

రాజస్తాన్‌లోని(Rajasthan) ఉదయ్‌పూర్‌లో(Udaypur) అమీర్‌ఖాన్‌(Aamir Khan) కూతురు ఇరాఖాన్(Ira Khan) పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. తన కూతురు ప్రేమించిన నుపుర్‌శిఖరేకు(Nupur Shikhare) ఇచ్చి అమీర్‌ అంగరంగవైభవంగా వివాహం జరిపించారు. ముంబైలో తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్న ఇరాఖాన్, నుపుర్‌శిఖరే ఈ జంట ఉదయ్‌పూర్‌లో పెళ్లి వేడుకలు జరుపుకున్నారు. ఉదయ్‌పూర్‌లో ఇరా, నుపుర్‌ లిప్‌ కిస్‌ పెట్టుకొని ఉంగరాలు మార్చుకున్నారు. పెళ్లి కూతురు తండ్రి అమీర్‌ఖాన్‌ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వేడుకకు అమీర్‌ఖాన్, తన మాజీ భార్య రీనా దత్తాతో(Rina Dutta) కలిసి తన కన్నీళ్లను తుడుచుకుంటూ కనిపించాడు.
ఇరా ఖాన్ మరియు నుపుర్ శిఖరే వివాహ వేడుకకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

ఇరా పెళ్లికి ముందు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కూతురు పెళ్లిలో చాలా ఎమోషనల్ అవుతానని అమీర్‌ఖాన్‌ చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "మెయిన్‌తో బడా ఎమోషనల్ హోతా హూన్ భాయ్, యుఎస్ఎస్ దిన్ మెయిన్ బహుత్ రోనే వాలా హూన్ యే తో తాయ్ హై (నేను చాలా భావోద్వేగానికి లోవుతా.. ఆ రోజు నేను చాలా ఏడుస్తాను, కచ్చితంగా) అంటూ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన చెప్పినట్లే తన కూతురు పెళ్లి సందర్భంగా కంటతడి పెట్టారు.

Updated On 11 Jan 2024 2:50 AM GMT
Ehatv

Ehatv

Next Story