అల్లు అర్జున్(Alluarjun) పై ప్రశంసల వర్షం కురిపించింది బాలీవుడ్ సీనియర్ హీరోయిన్.. డ్రీమ్ గళ్ హేమా మాలిని(Hema malini). బన్నీని బాలీవుడ్ హీరోలతో పోల్చుతూ.. ఆకాశానికి ఎత్తేసింది. ఇంతకీ ఎందుకు ఇలా బన్నీని అకస్మాత్తుగా పొగిడేసింది.

అల్లు అర్జున్(Alluarjun) పై ప్రశంసల వర్షం కురిపించింది బాలీవుడ్ సీనియర్ హీరోయిన్.. డ్రీమ్ గళ్ హేమా మాలిని(Hema malini). బన్నీని బాలీవుడ్ హీరోలతో పోల్చుతూ.. ఆకాశానికి ఎత్తేసింది. ఇంతకీ ఎందుకు ఇలా బన్నీని అకస్మాత్తుగా పొగిడేసింది.

అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్(Tollywood) కు మాలీవుడ్ కు గతంలోనే తెలుసు.. ఇక పుష్ప(Pushpa) సినిమాతో బాలీవుడ్ తో పాటు.. పాన్ ఇండియాకు అల్లు అర్జున్ అంటే ఏంటో తెలిసింది. పుష్ప మానియ పాన్ ఇండియాకు ఫీవర్ పట్టుకున్నట్టు పట్టుకుంది. దాంతో ఆయన మ్యానరిజం.. స్టైల్ కు బాగా ఇంప్రెస్ అయ్యారు బాలీవుడ్ జనాలు. ఇక పుష్ప2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో పుష్ప2ని అంతకు మించి అన్నట్టుగా తెరకెక్కిస్తున్నారు టీమ్. ఇప్పటికే పార్ట్ 2 నుంచి రిలీజ్ అయిన అమ్మవారి గెటప్ లో అల్లు అర్జున్ పోస్టర్ కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

ఈ క్రమంలోనే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్.. డ్రీమ్ గళ్ల్ ... హేమ మాలిని(Hema malini) తాజాగా అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించింది. బన్నీపై ఆమె చేసిన ఇంటరెస్టింగ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పుష్ప రిలీజ్ అయ్యి ఏడాదిన్నర కావస్తుంటే.. హేమా మాలిని మాత్రం రీసెంట్ గానే పుష్ప సినిమా చూసిందట. ఆ సినిమాలో అల్లు అర్జున్ మేకోవర్ అండ్ యాక్టింగ్ సూపర్ అంటూ.. ప్రశంసలు కురిపించింది. అయితే పుష్ప సినిమా చూసిన తరువాత అల్లు అర్జున్ ఇంతకు ముందు సినిమా కూడా చూద్దాం అనిపించిందట.

దాంతో పుష్పకంటే ముందు ఆయన చేసిన అలవైకుంఠపురములో సినిమాను చూసిందట హేమా మాలిని. ఇక పుష్పలో... చాలారగ్డ్ అండ్ రస్టిక్ గా కనిపించిన అల్లు అర్జున్, అంతకముందు సినిమాలో చాలా స్టైలిష్ గా.. హ్యాండ్సమ్ గా కనిపించేసరికి ఆమె ఆశ్చర్యపోయిందట. సినిమా కోసం ఈ హీరో ఎంత కష్టపడటానికైనా రెడీగా ఉంటాడు అని అప్పుడు ఆమెకు అనిపించినట్టుంది. దాంతో బన్నీపై ప్రశసంలు కురిపించడం స్టార్ట్ చేసింది. ఒక పాత్ర కోసం అతను ఎంత శ్రమిస్తాడు.. గ్లామర్, డీ గ్లామర్ అంనేపరిది దాటిపోయి పుష్ప పాత్రకు తగ్గట్టు తను వేసిన స్టెప్స్ చాలా ఫేమస్ అయ్యాయి అన్నారు.

పుష్పలో తన యాక్టింగ్ అండ్ లుక్ నాకు చాలా బాగా నచ్చాయి. మన హిందీ సినిమాలోని హీరోలు అటువంటి పాత్రలు చేయడానికి సందేహిస్తుంటారు.. అంటూ కామెంట్స్ చేసింది. దాంతో .. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ పుష్ప2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అది కనక హిట్ అయితే.. బన్నీకి గ్లోబర్ స్టార్ ఇమేజ్ పక్కా పిక్స్ అవ్వాల్సిందే.

Updated On 12 May 2023 12:24 AM GMT
Ehatv

Ehatv

Next Story