బాహుబలి(Bahubali) సినిమా తర్వాత వచ్చిన మూడు సినిమాలు ఆశించినంతగా విజయం సాధించకపోయినా ప్రభాస్‌(Prabhas) క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ప్రభాస్‌ కాల్షీట్ల కోసం నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. దర్శకులు కూడా ప్రభాస్‌కు సరిపోయే స్క్రిప్టులు రెడీ చేసుకుని ప్రభాస్‌ గ్రీన్‌ సిగ్నల్‌ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆల్‌రెడీ ప్రభాస్‌ వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఆయనతో సినిమా చేయాలంటే కనీసం మూడేళ్లు ఆగాలి. ఎందుకంటే మూడేళ్లకు సరిపడా క్యూ లైన్‌ రెడీగా ఉంది.

బాహుబలి(Bahubali) సినిమా తర్వాత వచ్చిన మూడు సినిమాలు ఆశించినంతగా విజయం సాధించకపోయినా ప్రభాస్‌(Prabhas) క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ప్రభాస్‌ కాల్షీట్ల కోసం నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. దర్శకులు కూడా ప్రభాస్‌కు సరిపోయే స్క్రిప్టులు రెడీ చేసుకుని ప్రభాస్‌ గ్రీన్‌ సిగ్నల్‌ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆల్‌రెడీ ప్రభాస్‌ వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఆయనతో సినిమా చేయాలంటే కనీసం మూడేళ్లు ఆగాలి. ఎందుకంటే మూడేళ్లకు సరిపడా క్యూ లైన్‌ రెడీగా ఉంది. దానికి తోడు ప్రభాస్‌తో తీసేవాళ్లంతా పెద్ద డైరెక్టర్లు కావడంతో ఆయా సినిమాలపై అంచనాలు కూడా అదే విధంగా ఉన్నాయి.

పైగా ఆయన ఒక్క సినిమా బడ్జెట్‌ కనీసం 200 నుంచి 400 కోట్ల రూపాయల వరకు ఉంటోంది. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) దర్శకత్వంలో రూపొందుతున్న సలార్‌(Salaar) సినిమాతో పాటు ప్రాజెక్ట్‌ కే(Project K) చిత్రాలతో ప్రభాస్‌ బిజీగా ఉన్నారు. దాంతో పాటు మారుతి(Maruthi) సినిమా షూటింగ్‌ కూడా నడుస్తూ ఉంది. ప్రస్తుతం ప్రభాస్‌ అమెరికాలో(America) ఉన్నారు. జులై మొదటి వారంలో ఇండియాకు రానున్నారు. ఇండియాకు వచ్చిన తర్వాత మళ్లీ తన సినిమాలపై ఫోకస్‌ పెట్టనున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్‌ కోసం మరో ముగ్గురు దర్శకులు కథలతో సిద్ధంగా ఉన్నారు. బాహుబలి-2 తర్వాత ప్రభాస్‌ సినిమాలలో నేటివిటీ కనిపించడం లేదని, తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీయడం లేదనే విమర్శలు ఉన్నాయి.

అందుకే తర్వాతి సినిమాలన్నింటికీ తెలుగు దర్శకులు అయితేనే బెటర్‌ అన్న నిర్ణయానికి వచ్చారు ప్రభాస్‌. కమర్షియల్‌ డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌(Harish Shankar) ఒక కథను రెడీ చేస్తున్నట్టు సమాచారం దీనిని ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ అత్యంత భారీగా నిర్మించాలని అనుకుంటోంది. మరోవైపు సుకుమార్‌(Sukumar) కూడా ప్రభాస్‌ కోసం ఒక స్టోరీని రెడీ చేస్తున్నాడు. ఇది పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. నిజాం కాలం నాటి కథతో ప్రభాస్‌తో ఓ సినిమా తీయాలని ఎప్పట్నుంచో సుకుమార్‌ అనుకుంటున్నాడు. వీరితో పాటు త్రివిక్రమ్‌(Trivikram) డైరెక్షన్‌లో కూడా ప్రభాస్‌ సినిమా ఉండబోతున్నది. సలార్‌, ప్రాజెక్ట్ కే, మారుతి సినిమాలతో పాటు సందీప్‌ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) సినిమా స్పిరిట్‌ కూడా లైన్‌లో ఉంది. ఇవి కంప్లీట్‌ అయ్యే సరికి కనీసం రెండేళ్లు పడుతుంది. ఆ తర్వాతే కొత్త సినిమాల గురించి ప్రభాస్‌ ఆలోచిస్తారు.

Updated On 29 Jun 2023 5:01 AM GMT
Ehatv

Ehatv

Next Story