దర్శకుడు హరీశ్ శంకర్(Harish shankar) స్టయిల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. కుటుంబకథలకు కమర్షియల్ హంగులు జోడించి సినిమాను జనరంజకంగా రూపొందిస్తారాయన! అందుకే అవి బ్లాక్ బస్టర్‌లు అవుతుంటాయి. ప్రస్తుతం హరీశ్ శంకర్ ఉస్తాద్ భగత్‌సింగ్(Ustad Bhagat Singh) సినిమాతో తీరిక లేకుండా ఉన్నారు. అన్నట్టు మెగా ఫ్యామిలీకి హరీశ్ చాలా దగ్గర. ఓ రకంగా భక్తుడని చెప్పొచ్చు. పవన్(Pawan kalyan) అంటే మరీ మరీ ఇష్టం.
దర్శకుడు హరీశ్ శంకర్(Harish shankar) స్టయిల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. కుటుంబకథలకు కమర్షియల్ హంగులు జోడించి సినిమాను జనరంజకంగా రూపొందిస్తారాయన! అందుకే అవి బ్లాక్ బస్టర్‌లు అవుతుంటాయి. ప్రస్తుతం హరీశ్ శంకర్ ఉస్తాద్ భగత్‌సింగ్(Ustad Bhagat Singh) సినిమాతో తీరిక లేకుండా ఉన్నారు. అన్నట్టు మెగా ఫ్యామిలీకి హరీశ్ చాలా దగ్గర. ఓ రకంగా భక్తుడని చెప్పొచ్చు. పవన్(Pawan kalyan) అంటే మరీ మరీ ఇష్టం. కట్టే కాలే వరకు పవన్ కల్యాణ్ అభిమానినే అంటూ ఆ మధ్యన కామెంట్ కూడా చేశారు.
పవన్ కల్యాణే కాదు, మెగా ఫ్యామిలీలో హీరోలందరితో హరీశ్‌కు మంచి రిలేషన్ ఉంది. ఇప్పటి వరకు హరీశ్ శంకర్ ఏడు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇందులో నాలుగు మెగా హీరోలవే కావడం విశేషం. ఇప్పుడు చేస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్‌లో హీరో పవన్ కల్యాణ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నలుగురు మెగా హీరోలకు పెద్ద హిట్లు ఇచ్చారు హరీశ్. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) ఒక్కరే మిగిలారు. త్వరలో ఆ ముచ్చట కూడా తీరబోతున్నది. హరీశ్ శంకర్ ఇటీవల ఓ మంచి ఫ్యామిలీ కథతో(Family story) చిరంజీవిని కలిసినట్టు సమాచారం. కథ విన్న చిరంజీవి ఇంప్రెస్ అయ్యారట. వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారట. హరీశ్‌కు ఎప్పట్నుంచో చిరంజీవితో సినిమా తీయాలన్న కోరిక ఉంది. ఇన్నాళ్లకు అది నెరవేరబోతున్నది.
అందుకే హరీశ్ తెగ సంబరపడుతున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో తీస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్ పూర్తయిన తర్వాత చిరంజీవితో సినిమా మొదలవుతుందట.
అయితే పవన్‌కల్యాణ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్‌సింగ్‌కు డేట్స్ సర్దుబాటు చేయలేకపోతున్నారట! పవన్ ఇప్పుడు నాలుగు సినిమాలను ఒప్పుకున్నారు. అందులో హరిహర వీరమల్లు సినిమా ఊసే లేదు. ఇప్పుడు బ్రో, ఓజీ సినిమాలు మాత్రం షూటింగ్‌ను వేగంగా జరుపుకుంటున్నాయి. ఇవి పూర్తి అయిన తర్వాత ఉస్తాద్ భగత్‌సింగ్‌కు డేట్స్ ఇస్తారట పవన్. అప్పటి వరకు హరీశ్ ఎదురుచూడక తప్పదు. ఎంత ఆలస్యమైనా ఫర్వాలేదు. సినిమా ఎప్పుడొచ్చినా బ్లాక్ బస్టర్ ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు.