హీరోయిన్‌ నిధి అగర్వాల్‌(Nidhi Agerwal) పుట్టినరోజు సందర్భంగా 'హరి హర వీర మల్లు'(Hari hara Veermallu) చిత్రం నుంచి ప్రత్యేక పోస్టర్(Poster) విడుదల చేశారు

హీరోయిన్‌ నిధి అగర్వాల్‌(Nidhi Agerwal) పుట్టినరోజు సందర్భంగా 'హరి హర వీర మల్లు'(Hari hara Veermallu) చిత్రం నుంచి ప్రత్యేక పోస్టర్(Poster) విడుదల చేశారు. నిధి అగర్వాల్‌కు ప్రత్యేక పోస్టర్‌తో జన్మదిన శుభాకాంక్షలు(Birthday) తెలిపిన 'హరి హర వీర మల్లు' చిత్ర బృందం. పవర్‌స్టార్‌ పవన్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకున్నారు. చారిత్రాత్మక చిత్రంలో గొప్ప యోధుడి పాత్రలో పవన్‌ కనిపిస్తున్నారు. ఆగస్ట్‌ 14 నుంచి ఈ సినిమా షూటింగ్‌ విజయవంతంగా తిరిగి ప్రారంభమైంది. దాదాపు 500-600 మంది జూనియర్ ఆర్టిస్టులతో యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. యాక్షన్‌ దర్శకులు భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు.

దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు, సినీ ప్రేమికులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు వెండితెరపై ఒక అద్భుతమైన అనుభూతిని అందించడానికి శక్తి వంచనలేకుండా కృషిచేస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ సహా అనేక మంది ప్రముఖ నటీనటులు ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, తోట తరణి ఈ సినిమా కోసం భారీ, భారీ సెట్‌లను నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు. ఎం.ఎం.కీరవాణి ఈ సినిమాకు సంగీతం వహిస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా యూనిట్‌ మరో ఆసక్తికర పోస్టర్‌ విడుదల చేసింది. ఇందులో కథానాయికగా నటిస్తున్న నిధి అగర్వాల్ పుట్టిన రోజు సందర్భంగా ఆకట్టుకునే పోస్టర్‌ విడుదల చేసింది. ఇందులో నిధి అగర్వాల్‌ మహాలక్ష్మిదేవి అవతారంలో బంగారు వర్ణం చీరలతో పాటు ప్రత్యేక ఆకర్షణీయ ఆభరణాలు ధరించి మెరిసిపోతుంది. సాక్షాత్తు ఆ మహాలక్ష్మిదేవి అమ్మవారిలా దర్శనమిస్తుండడంతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.

తండ్రిని కొడుతుంటే తట్టుకోలేక ప్రాణాలు విడిచిన కూతురు

సూర్యాపేట జిల్లా నాగారం మండలం డీకొత్తపల్లి గ్రామానికి చెందిన కాసం సోమయ్యకు అదే గ్రామానికి చెందిన కడారి సైదులు, కడారి సోమయ్య, కాసం కళింగంతో గత కొన్ని రోజులుగా భూమి విషయంపై తగాదాలున్నాయి.గురువారం బోనాల పండుగ రోజు రాత్రి 10 గంటలకు సోమయ్య ఇంటికొచ్చి సైదులు, సోమయ్య, కళింగం కర్రలు, ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో సోమయ్య కాలు విరిగడంతో పాటు తల పగలగా అడ్డుకోబోయిన భార్య తలకూ గాయాలయ్యాయి. దాడి జరుగుతుంటే చూస్తున్న కూతురు పావని(14) 'నాన్నా.. మా నాన్నను వదలండి' అంటూ అడిగినా అలానే కొట్టడంతో సృహతప్పి కుప్పకూలింది. కుటుంబసభ్యులు వెళ్లిచూడగా అప్పటికే చనిపోయింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కన్న కూతురు తమ కోసం ప్రాణ త్యాగం చేయడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


Eha Tv

Eha Tv

Next Story