పవన్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan) వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. ఓ పక్క రాజకీయ సమావేశాలు, మరో పక్క సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నారు. ఆయన నటిస్తున్న ఉస్తాద్‌ భగత్‌సింగ్‌(Ustaad Bhagat Singh), ఓజీ(OG) సినిమాల షూటింగ్‌లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ గ్లింప్స్‌కు అనూహ్య స్పందన లభించింది.

పవన్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan) వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. ఓ పక్క రాజకీయ సమావేశాలు, మరో పక్క సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నారు. ఆయన నటిస్తున్న ఉస్తాద్‌ భగత్‌సింగ్‌(Ustaad Bhagat Singh), ఓజీ(OG) సినిమాల షూటింగ్‌లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ గ్లింప్స్‌కు అనూహ్య స్పందన లభించింది. ఇప్పుడు ఫ్యాన్స్‌ దృష్టి అంతా క్రిష్‌ డైరెక్షన్‌(Director Krish)లో వస్తున్న హరిహరవీరమల్లు(Hari Hara Veera Mallu) సినిమాపైనే ఉంది. ఈ సినిమా అప్‌డేట్‌ రాక చాలా రోజులయ్యింది. దానికోసమే అభిమానులు ఎదురుచూస్తున్నారు. కొన్ని కారణాల వల్ల హరిహరవీరమల్లు తాజా షెడ్యూల్‌ వాయిదా పడిన విషయం తెలిసిందే. జూన్‌ ఫస్ట్‌ వీక్‌ నుంచి హరిహరవీరమల్లు సినిమా కోసం పవన్‌కల్యాణ్‌ డేట్స్‌ కేటాయించారట. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్‌ సీన్స్‌ను తెరకెక్కించబోతున్నారట. మొఘల్‌ కాలం నాటి కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో అన్యాయాలపై తిరుగబడే బందిపోటు పాత్రలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్నారు.

Updated On 23 May 2023 11:43 PM GMT
Ehatv

Ehatv

Next Story