✕
కొందరి గురించి చెప్పేటప్పుడు ఉన్నదాన్నే గోరంతలు చేసి చెప్పాల్సి వస్తుంది. అది కొంచెం కష్టం. కానీ కమల్ హాసన్(Kamal Haasan) లాంటివాళ్ల కొండంత ప్రతిభని కొంచెంలో చెప్పడం చాలా చాలా కష్టం. కమల్ నటనకి భాషల హద్దులు లేవు. ఆ ప్రయోగాలకి ఎల్లలు లేవు. ఆ ప్రతిభకి ఎన్ని విశేషణాలైనా సరిపోవు. ఇవాళ ఆ అసమాన నటుడి పుట్టిన రోజు(Birthday) .

x
kamal
-
- కొందరి గురించి చెప్పేటప్పుడు ఉన్నదాన్నే గోరంతలు చేసి చెప్పాల్సి వస్తుంది. అది కొంచెం కష్టం. కానీ కమల్ హాసన్(Kamal Haasan) లాంటివాళ్ల కొండంత ప్రతిభని కొంచెంలో చెప్పడం చాలా చాలా కష్టం. కమల్ నటనకి భాషల హద్దులు లేవు. ఆ ప్రయోగాలకి ఎల్లలు లేవు. ఆ ప్రతిభకి ఎన్ని విశేషణాలైనా సరిపోవు. ఇవాళ ఆ అసమాన నటుడి పుట్టిన రోజు(Birthday) . ఆ తరం ఈ తరం మాత్రమే కాదు... తరతరాలూ భారతదేశం గర్వించదగ్గ నటుడు కమల్. బర్త్‌డే జరుపుకుంటున్న ఆ మహానటుడికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెబుదాం. ఆ నట జీవన స్రవంతిని ఓ సారి గుర్తు చేసుకుందాం.
-
- కొందరి గురించి చెప్పేటప్పుడు ఉన్నదాన్నే గోరంతలు చేసి చెప్పాల్సి వస్తుంది. అది కొంచెం కష్టం. కానీ కమల్ హాసన్(Kamal Haasan) లాంటివాళ్ల కొండంత ప్రతిభని కొంచెంలో చెప్పడం చాలా చాలా కష్టం. కమల్ నటనకి భాషల హద్దులు లేవు. ఆ ప్రయోగాలకి ఎల్లలు లేవు. ఆ ప్రతిభకి ఎన్ని విశేషణాలైనా సరిపోవు. ఇవాళ ఆ అసమాన నటుడి పుట్టిన రోజు(Birthday) . ఆ తరం ఈ తరం మాత్రమే కాదు... తరతరాలూ భారతదేశం గర్వించదగ్గ నటుడు కమల్. బర్త్‌డే జరుపుకుంటున్న ఆ మహానటుడికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెబుదాం. ఆ నట జీవన స్రవంతిని ఓ సారి గుర్తు చేసుకుందాం.
-
- ఆ నటన అసమానమైనది. ఆ రికార్డులు అధిగమించడమూ సాధ్యం కాదు. ఆ నటనని అనుసరించడమూ సాధ్యం కాదు. అందుకే కమల్ యూనిక్. యూనివర్సల్. నిజంగానే కమల్ హాసన్ సకలకళావల్లభుడు. నటుడిగా శిఖరాలు చూసినా … నానా రంగాల్లో తన ప్రతిభని విస్తరించాడు. పాటలు పాడాడు(singer). డైరెక్షన్(director) చేశాడు. నిర్మాతగా(Producer) మారాడు. కథలు రాశాడు(Writter). ఎప్పుడు ఏ ప్రయోగం చేయాల్సి వచ్చినా ముందున్నాడు. అందుకే అఖిల భారత ప్రేక్షకుల గుండెల్లో ఓ అద్భతమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.
-
- ఇంటర్నేషనల్ మార్కు నటనకి ఇండియన్ ఎడ్రస్ గా నిలిచాడు. మొట్ట మొదటి చిత్రంతోనే ఉత్తమ బాల నటుడిగా(Best Child artist) అవార్డ్ తెచ్చుకున్న విలక్షణ నటుడు కమల్ హాసన్. కళత్తూర్ కణ్ణమ్మ సినిమా తరవాత కూడా ఎంజీఆర్(MJR), శివాజీ గణేశన్(Shivaji Ganeshan), జెమినీ గణేశన్(Gemini Ganeshan) నగేష్ లాంటివాళ్ల సినిమాల్లో బాల నటుడిగా చేశాడు. ఆ అనుభవంతో ఎదుగుతూ వచ్చాయి. నటనలో విశ్వరూపం చూపించాడు. ఆ చిన్నారి కమల్ హాసన్ ఇంతింతై ఇంత పెద్ద నటుడవుతాడని అప్పట్లో ఎవరూ అనుకుని ఉండరు.
-
- హీరో అయిన తొలిరోజుల్లో కమల్ అలాంటి కొన్ని మలయాళ సినిమాల్లో నటించాడు. తరవాత తమిళంలోకి ఎంటరయ్యాడు. దర్శకుడు కె.బాలచందర్(K.Balachander) కమల్ హాసన్ కి మెంటర్ గా మారాడు. బాలచందర్ పర్యవేక్షణలో కమల్ నిజమైన నటన నేర్చుకున్నాడు. మహానటుడిగా ఎదిగాడు. రజనీకాంత్(Rajinikanth) కీ , కమల్ కీ కూడా బాలచందరే గురువైనా రజనీ మాస్ హీరోగా ఎదిగితే కమల్ క్లాస్ హీరోగా పరిణతి చెందాడు. నటులంతా ఒకలా ఉండరు. చాలామంది నాలుగు సినిమాల వరకే నటన నేర్చుకుంటారు.
-
- తరవాత అంతా వచ్చేసిందనుకుని విర్రవీగుతారు. రీటేక్ చెబితే రెచ్చిపోతారు. సింగిల్ టేక్ ఆర్టిస్టులం మేమంటూ చిరాకు పడిపోతారు. కానీ కమల్ హాసన్ లాంటి నటులు నిజమైన విద్యార్థులు. వెండితెర(silver screen) మీద తొలినాళ్లలో ఎంతశ్రద్ధతో నటన నేర్చుకున్నారో... ఎంత ఎదిగినా ఆ శ్రద్ధని అలాగే కాపాడుకుంటారు. నటజీవితం మొదలై ఎంత కాలమైనా … ఎప్పటికప్పుడు ఏదో ఓ కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటారు.అందుకే ప్రేక్షకులకి ఎప్పుడూ ఏదో ఓ కొత్తదనం చూపించగలుగుతూ ఉంటారు. కమల్ హాసన్ సక్సెస్ సీక్రెట్ అదేనేమో
-
- చూడగానే ఆకర్షించే ముఖం... చిత్రమైన వాచకం.. అవలీలగా పలికే హావభావాలు.. అద్భుతమైన నాట్యకౌశలం... అన్నీ కలిస్తే కమల్. సెవెంటీస్ లో కమల్ యూత్ ని అమితంగా ఆకట్టుకున్నాడు. అటు తమిళం(Tamil)... ఇటు తెలుగు(Telugu) … రెండు భాషల్లోనూ తనకంటూ ఓ మార్క్ సంపాదించుకున్నాడు. మొదట్లో మలయాళ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మాత్రమే కనిపించిన కమల్ తరవాత పూర్తి స్థాయి కధా నాయకుడిగా మారాడు. అవర్గళ్ , అవళ్ ఓరు తొడర్కదై, సొల్ల తాన్ నినైక్కిరేన్ మాణవన్" ఇలా చాలా సినిమాల్లో చేశాడు. అయితే శ్రీదేవితో(sri devi) కలిసి చేసిన పదినారు వయదినిలే కమల్ కి మొదట్లో గొప్ప పేరు తీసుకొచ్చింది. 'మాస్ క్రేజ్' అన్న పదం మనం వింటూ ఉంటాం. అయితే కమల్ హాసన్ కి ఉన్నది … క్లాస్ క్రేజ్.
-
- అప్పుడూ ఇప్పుడూ అంతే! అయితే సెవెంటీస్ లో దీనికి యూత్ క్రేజ్ కూడా కలిసింది. కమల్ సినిమా వస్తోందంటే చాలు … కుర్రకారు ఎగబడేవారు. దర్శకుడు కె.బాలచందర్ తీసిన మరో చరిత్ర చరిత్ర సృష్టించింది. ఆకలిరాజ్యం, అందమైన అనుభవం.. ఎర్రగులాబీలు … దేనికదే! హీరో అంటే ఇలానే ఉండాలి... అనే రెగ్యులర్ రూల్స్ ని బ్రేక్ చేస్తూ కమల్ ఓ కొత్త ట్రెండ్ ని సృష్టించాడు. కమల్ నటన గురించి చెప్పాలంటే మొదటి సినిమా నుంచి మొన్న వచ్చిన విక్రమ్(vikram) వరకు ప్రతీ సినిమాను విశ్లేషించాలి. అది మరో సినిమా అంత అవుతుంది. అంచేత ఇప్పటికీ కమల్‌హాసన్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ ఆయన మరిన్ని అద్భుతమైన సినిమాలను మనకు అందించాలని కోరుకుందాం!

Ehatv
Next Story