చాలా తక్కువ బడ్జెట్ లో మంచి సినిమాలు అందించాలంటే కొంత మంది డైరెక్టర్లకే సాధ్యం అటువంటివారిలో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకన్నాడు ప్రశాంత్ వర్మ. చిన్న సినిమలను క్వాలిటీ విజువల్స్ తో అందించాలంటే ఆయనతరువాతే ఎవరైనా తాజాగా ప్రశాంత్ వర్మ చేసిన సినిమా హనుమాన్ కూడా ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చింది. ఈమధ్యే చిరంజీవి ఓ మాట అన్నారు. ఆయన అన్నట్టుగా.. క్వాలిటీ కథలను ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు. తాజాగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమా హనుమాన్. యంగ్ స్టార్ తేజ సజ్జా హీరోగా నటించిన ఈసినిమా మొదటి నుంచి చెపుతున్నట్టే.. సూపర్ సక్సెస్ ను సాధించడంతో పాటు.రికార్డ్ క్రియేట్చేసింది.
దర్శకుడు.. ప్రశాంత్ వర్మ(Prashanth Varma) ఇట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. తన ఆఫీస్ కు ఓ స్పెషల్ గెస్ట్ వచ్చాడంటూ..ఇంట్రెస్టింగ్ విషయంవెల్లడించాడు. ఇంతకీ ఆయన ఆఫీస్ కు వచ్చిన స్పెషల్ గెస్ట్ ఎవరు..
చాలా తక్కువ బడ్జెట్ లో మంచి సినిమాలు అందించాలంటే కొంత మంది డైరెక్టర్లకే సాధ్యం అటువంటివారిలో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకన్నాడు ప్రశాంత్ వర్మ. చిన్న సినిమలను క్వాలిటీ విజువల్స్ తో అందించాలంటే ఆయనతరువాతే ఎవరైనా తాజాగా ప్రశాంత్ వర్మ చేసిన సినిమా హనుమాన్ కూడా ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చింది. ఈమధ్యే చిరంజీవి ఓ మాట అన్నారు. ఆయన అన్నట్టుగా.. క్వాలిటీ కథలను ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు. తాజాగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమా హనుమాన్. యంగ్ స్టార్ తేజ సజ్జా హీరోగా నటించిన ఈసినిమా మొదటి నుంచి చెపుతున్నట్టే.. సూపర్ సక్సెస్ ను సాధించడంతో పాటు.రికార్డ్ క్రియేట్చేసింది.
పెద్ద పెద్ద సినిమాలకు సంక్రాంతి(Sankranti) సీజన్ లో పోటీ పడింది హనుమాన్ సినిమా. థియేటర్ల విషయంలో ఇబ్బందులు పడుతూ.. పెద్ద సినిమాల మధ్య నలిగిపోతూ.. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈమూవీ.. కంటెంట్ ఉంటే కటౌట్లతో పనిలేదు అని నిరూపించింది. కథలో పస ఉంటే...పెద్ద సినిమాలు ఎన్ని ఎదురొచ్చినా.. తిరుగుండదని హనుమాన్(Hanuman) సినిమా నిరూపించింది. పాన్ ఇండియా మూవీగా.. . దేశవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు అంతటా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో భారీ ఓపెనింగ్స్ రాబడుతున్నది.
ఇక తాజాగా ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఆపోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అదేంటంటే.. తన ఆఫీస్ కు ఎవరో స్పెషల్ గెస్ట్ వచ్చారని పోస్ట్ పెట్టారు. ఆయన ఆఫీస్ కు ఆంజనేయుడువచ్చాడు.. అవును.. ప్రశాంత్ వర్మ పెట్టినపోస్ట్ లో.. ఆయన ఆఫీస్ రూఫ్ పై ఓ కోతి కనిపించింది. ఈ సినిమాలో కోటి అనే కోతి పాత్ర ఉన్న విషయం తెలిసిందే. ఈ పాత్రకు టాలీవుడ్ నటుడు మాస్ మహారాజా రవితేజ(Ravi teja) డబ్బింగ్ చెప్పడంతో ఫుల్ వైరల్ అయ్యింది. ఇక ఈ సినిమా చూసిన వారు కోతి పాత్ర బాగుందని.. హీరో లాగానే.. కోటికి కూడా మాస్ ఎలివేషన్స్ ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. నా ఆఫీస్ పైకప్పు మీద ఎవరు వచ్చారో చుడండి అంటూ కోతి ఉన్న ఫొటోను ప్రశాంత్ వర్మ పోస్ట్ చేశాడు. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు కోటి వచ్చాడు, కోటి అన్న మాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు