చైల్డ్ ఆర్టిస్ట్‌గా సిల్వర్‌స్క్రిన్‌కు పరిచయం అయిన హన్సిక మోత్వానీ(Hansika Mothvani)) దేశముదురు సినిమాతో హీరోయిన్ అయ్యింది. తొలి సినిమాతోనే హిట్ అందుకున్న హన్సిక మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వరుస అవకాశాలను దక్కించుకుంది. స్టార్ హీరోయిన్‌గా ఉన్న సమయంలోనే ముంబాయికి చెందిన వ్యాపారవేత్త, ప్రియుడు సోహైల్ కతూరియాను(Sohail Kathuriya) పెళ్లి చేసుకుంది.

Hansika Motwani
చైల్డ్ ఆర్టిస్ట్‌గా సిల్వర్‌స్క్రిన్‌కు పరిచయం అయిన హన్సిక మోత్వానీ(Hansika Motwani)) దేశముదురు సినిమాతో హీరోయిన్ అయ్యింది. తొలి సినిమాతోనే హిట్ అందుకున్న హన్సిక మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వరుస అవకాశాలను దక్కించుకుంది. స్టార్ హీరోయిన్‌గా ఉన్న సమయంలోనే ముంబాయికి చెందిన వ్యాపారవేత్త, ప్రియుడు సోహైల్ కతూరియాను(Sohail Kathuriya) పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తోంది హన్సిక. ప్రస్తుతం తెలుగులో మై నేమ్ ఈజ్ శ్రుతి(My Name Is Shruthi), తమిళంలో రౌడీబేబి(Rowdy Baby), గార్డియన్(guardian), మ్యాన్ సినిమాలలో నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలను చెప్పింది హన్సిక. టాలీవుడ్‌లో ఓ ప్రముఖ హీరో ఆమెను బాగా ఇబ్బంది పెట్టాడట. పొద్దస్తమానం డేట్‌కు వెళదాం వస్తావా అంటూ విసిగించేవాడట! ఈ విషయాన్ని చెబుతూ అలా వెంటపడి వేధించిన హీరోకు తగిన విధంగా బుద్ధి చెప్పానని తెలిపింది హన్సిక. అయితే ఆ టాలీవుడ్ హీరో ఎవరన్నది మాత్రం హన్సిక చెప్పలేదు. హన్సికను ఆ విధంగా వేధించిన వారు ఎవరై ఉంటారని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.
