హీరో బాలకృష్ణ(Balakrishna) ఏం చేసినా, ఏం మాట్లాడినా ఆయన అభిమానులకు బాగానే ఉంటుంది కానీ మిగతావారికే కంపరమేస్తుంది. ఆయన బ్లడ్‌ బ్రీడ్‌ వేరే కాబట్టి బహిరంగ ప్రదేశాలలో కూడా చిత్ర విచిత్రాలు చేస్తుంటారు.

హీరో బాలకృష్ణ(Balakrishna) ఏం చేసినా, ఏం మాట్లాడినా ఆయన అభిమానులకు బాగానే ఉంటుంది కానీ మిగతావారికే కంపరమేస్తుంది. ఆయన బ్లడ్‌ బ్రీడ్‌ వేరే కాబట్టి బహిరంగ ప్రదేశాలలో కూడా చిత్ర విచిత్రాలు చేస్తుంటారు. సినిమా వేదికల్లో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పటికీ రీసౌండ్‌ అవుతూనే ఉన్నాయి. మొన్న యువ నటుడు విశ్వక్సేన్‌(Vishwaksen) నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి(Gangs Of Godhavari) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ వేడుకకు బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చాడు. వేదికపై నటి అంజలిని(Anjali) నెట్టివేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లతో పాటు చాలా మంది బాలయ్యపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ దర్శకుడు కూడా విమర్శించాడు. దర్శకుడు హన్సల్ మెహతా(Hansal Mehta) తెలుసు కదా! స్కామ్‌ 1992, ఛల్‌, షాహిద్‌, సిటీలైట్స్‌, అలీఘర్‌ వంటి సినిమాలు తీసి మంచి గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి. ఆయన బాలయ్య అనుచిత ప్రవర్తనపై విమర్శలు చేశారు. ఎవరు ఈ సభ్యత సంస్కారం లేని మనిషి అంటూ ఎక్స్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే వేడుకలో బాలకృష్ణ వాటర్‌ బాటిల్‌లో మందు కలుపుని వచ్చినట్టు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Updated On 30 May 2024 4:42 AM GMT
Ehatv

Ehatv

Next Story