పైన ఫోటోలో ఉన్న అందమైన యువతిని గుర్తుపట్టారా? జాగ్రత్తగా చూడండి.. ఇంకా గుర్తుపట్టలేకపోతున్నారా? అయితే ఆమె ఎవరో తెలుసుకుందాం! ఈ బ్యూటీ రెండు దశాబ్దాల కిందటే తెలుగు సినీ ఇండస్ట్రీలో(Film industry) అడుగుపెట్టారు. హీరోయిన్‌గా సినిమాలు చేశారు కానీ పెద్దగా గుర్తింపురాలేదు. ఆ తర్వాత ఐటమ్స్‌ సాంగ్స్‌(Item songs) చేశారు.

పైన ఫోటోలో ఉన్న అందమైన యువతిని గుర్తుపట్టారా? జాగ్రత్తగా చూడండి.. ఇంకా గుర్తుపట్టలేకపోతున్నారా? అయితే ఆమె ఎవరో తెలుసుకుందాం! ఈ బ్యూటీ రెండు దశాబ్దాల కిందటే తెలుగు సినీ ఇండస్ట్రీలో(Film industry) అడుగుపెట్టారు. హీరోయిన్‌గా సినిమాలు చేశారు కానీ పెద్దగా గుర్తింపురాలేదు. ఆ తర్వాత ఐటమ్స్‌ సాంగ్స్‌(Item songs) చేశారు. అప్పుడు విపరీతమైన క్రేజ్‌ వచ్చిందామెకు! వరుసగా అయిదేళ్ల పాటు వరుసపెట్టి సినిమాలు చేస్తూ వెళ్లారు. ఆ తర్వాత ఏమైందో ఏమో సినిమాల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఇదిగో ఈ గెటప్‌లో కనిపించారు.

అది కూడా ఓ ఆశ్రమంలో.. ఈ అందమైన అమ్మాయి పేరు హంస నందిని(Hamsa nandhini). మహారాష్ట్రలోని(maharastra) పుణెలో(pune) పుట్టి పెరిగిన ఈ అమ్మాయి 2004లో ఒక్కటవుదాం అనే తెలుగు సినిమాతో నటిగా మారారు. తర్వాతఅనుమానాస్పదం, అధినేత, ప్రవరాఖ్యుడు, ఈగ తదితర సినిమాల్లో నటించారు హంసనందిని. తర్వాత ప్రభాస్‌ హీరోగా వచ్చిన మిర్చిలో ఐటమ్‌ సాంగ్‌ చేశారు. అది హంసనందిని అదృష్టాన్ని పూర్తిగా మార్చేసింది. అటు పిమ్మట అయిదేళ్ల పాటు ఆడిపాడుతూ ప్రేక్షకులను అలరించారు.

మిర్చిలో(Mirchi) స్పెషల్‌ సాంగ్‌(Special song) చేసిన తర్వాత భాయ్‌, రామయ్య వస్తావయ్యా, అత్తారింటికి దారేది, లెజెండ్‌, లౌక్యం, బెంగాల్‌ టైగర్‌, సొగ్గాడే చిన్ని నాయనా, శ్రీరస్తు శుభమస్తు, జై లవకుశ చిత్రాలలో ప్రత్యేక గీతాలతో అలరించారు హంస నందిని. 2018లో గోపిచంద్ నటించిన పంతంలో చివరిసారిగా కనిపించారు. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు హంస నందిని. ఆమె సినిమాల్లో కనిపించకపోయేసరికి అందరూ ఆమెను మర్చిపోయారు.

2021 చివర్లో ఇన్‌స్టాలో(Instagram) ఓ పోస్ట్‌ పెట్టారు హంస నందిని. తాను క్యాన్సర్‌తో(Cancer) బాధపడుతున్నానని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని అందులో ప్రకటించారు. త్వరలో కోలుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. ఆమె అంత ధైర్యశీలి కాబట్టే క్యాన్సర్‌ ఆమెను వదిలిపెట్టి వెళ్లిపోయింది. ప్రాణాంతకమైన వ్యాధి నుంచి ఆమె బయటపడ్డారు. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. ఈ మధ్యనే కోయంబత్తూరులోని(Coimbatore) ఇషా ఆశ్రమంలో(esha Ashram) కనిపించారు. ఆ ఫోటోలనే ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. చాలా మందిలాగే ఈమెను నెటిజన్లు మొదట గుర్తుపట్టలేదు. నిశితంగా చూసి గర్తుపట్టేశారు. హంస నందిని ఎంత మారిపోయారు అని కామెంట్‌ చేస్తున్నారు.

Updated On 27 Jun 2023 4:44 AM GMT
Ehatv

Ehatv

Next Story