గుప్పెడంత మనసు(guppedantha manasu) సీరియల్ చూసేవారికి జగతి మేడమ్(Jagathi madam) తెలిసే ఉంటుంది. ఆ పాత్ర పోషించే నటి ఎవరో కూడా తెలిసే ఉంటుంది. ఈ సీరియల్‌తోనే ఆమె చాలా ఫేమస్ అయ్యారు. ఈమె అసలు పేరు జ్యోతిరాయ్(Jyothi Roy). రిషికి తల్లిగా, మహేంద్ర భూషణ్‌కు భార్యగా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అబ్బురపరుస్తున్న ఈ అందాల భామకు ఎవరైనా ఇట్టే ఫిదా అవ్వాల్సిందే.
గుప్పెడంత మనసు(guppedantha manasu) సీరియల్ చూసేవారికి జగతి మేడమ్(Jagathi madam) తెలిసే ఉంటుంది. ఆ పాత్ర పోషించే నటి ఎవరో కూడా తెలిసే ఉంటుంది. ఈ సీరియల్‌తోనే ఆమె చాలా ఫేమస్ అయ్యారు. ఈమె అసలు పేరు జ్యోతిరాయ్(Jyothi Roy). రిషికి తల్లిగా, మహేంద్ర భూషణ్‌కు భార్యగా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అబ్బురపరుస్తున్న ఈ అందాల భామకు ఎవరైనా ఇట్టే ఫిదా అవ్వాల్సిందే. సీరియల్‌లో జగతి మేడమ్ పాత్రకు తగినట్టుగా కట్టుబొట్టుతో ఆకట్టుకునే జ్యోతిరాయ్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) ఫుల్ స్టైలిష్ ఫోటోలతో కుర్రకారుకు నిద్రపట్టకుండా చేస్తున్నారు. లేటెస్ట్‌గా మన జగతి మేడమ్ ఒక వెబ్ సిరీస్‌లో ప్రధానపాత్రలో నటిస్తున్నట్టు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. ది ప్రెట్టి గర్ల్(The Pretty Girl) అనే వెబ్ సీరిస్‌లో తాను నటిస్తున్నట్టు చెబుతూ ఓ హాట్ ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ వెబ్ సిరీస్‌కు రాహుల్ దీపక్(Rahul Deepak) దర్శకత్వం వహిస్తున్నాడు. సీరియల్ కాబట్టి ఇప్పటి వరకు పద్ధతిగా నటించిన జ్యోతిరాయ్ ఓటీటీ కోసం తెరకెక్కుతున్న ఈ సిరీస్‌లో మాత్రం తన అందాలతో రెచ్చిపోవడం గ్యారెంటీ అని ఆమె ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ వెబ్ సిరీస్ కోసమే ఆమె గత కొంతకాలంగా అందాల ఆరబోత చేస్తున్నారన్నది చాలా మంది భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో గ్లామరస్ ఫొటోస్ పుణ్యామా అని జ్యోతిరాయ్ తెగ ఫేమస్ అయిపోయారు. దీంతో ఆమె నుంచి ఏ వార్త వచ్చినా వెంటనే వైరల్ అవుతుంది. ఇప్పటికే ఆమెకు కన్నడలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అక్కడ ఆమె పలు వెబ్ సీరిస్‌లలో కూడా నటించారు.