గుప్పెడంత మనసు(Gupedhantha manasu) సీరియల్ చూస్తున్న వారికి అందులో జగతిగా నటిస్తున్న జ్యోతిరాయ్‌(Jyothirai) సుపరిచితమే! ఓ రకంగా తెలుగు ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేస్తున్నారు జ్యోతిరాయ్‌. కన్నడ ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులను సంపాదించిన 38 ఏళ్ల జ్యోతిరాయ్‌ దాదాపు ఇరవైకి పైగా సీరియల్స్‌లో నటించారు.

గుప్పెడంత మనసు(Gupedhantha manasu) సీరియల్ చూస్తున్న వారికి అందులో జగతిగా నటిస్తున్న జ్యోతిరాయ్‌(Jyothirai) సుపరిచితమే! ఓ రకంగా తెలుగు ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేస్తున్నారు జ్యోతిరాయ్‌. కన్నడ ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులను సంపాదించిన 38 ఏళ్ల జ్యోతిరాయ్‌ దాదాపు ఇరవైకి పైగా సీరియల్స్‌లో నటించారు. అంతేకాకుండా చాలా సినిమాల్లోనూ కనిపించారు. శాండల్‌వుడ్‌లో బాగా ఫాలోయింగ్‌ ఉన్న నటీమణులలో జ్యోతిరాయ్‌ ఒకరు. జ్యోతిరాయ్‌ అసలు పేరు జయశ్రీరాయ్‌(Jayasri Rai). గుప్పెడంత మనసు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. రిషికి తల్లిగా, మహేంద్ర భూషణ్‌కు భార్యగా విలక్షణమైన నటనతో ఆకట్టుకుంటున్నారు.

జగతి పాత్రలో నటిస్తున్న జ్యోతిరాయ్‌ బయట కూడా అలాగే ఉంటారనుకుంటే మాత్రం పొరపాటే! తన ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) ఫుల్‌ స్టయిలీష్‌ ఫోటోలతో ఫ్యాన్స్‌కు పిచ్చేక్కిస్తుంటారు. లేటెస్ట్‌గా జ్యోతిరాయ్‌ ఒక హాట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలు చూసిన ఆమె ఫ్యాన్స్ ఇంత గ్లామర్ పెట్టుకుని తల్లి పాత్రలు వేస్తున్నారేమిటి మేడమ్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. మీరు హీరోయిన్ మెటీరియల్ అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం సీరియల్స్‌తో పాటు ప్రెట్టీ గర్ల్(Pretty Girl) అనే క్రైమ్ థిల్లర్ వెబ్‌ సిరీస్‌లో కూడా నటిస్తున్నారు జ్యోతిరాయ్‌. ఈ వెబ్ సిరీస్‌లో ఫీమేల్ లీడ్ రోల్‌ పోషిస్తున్నారు. ఇటీవలే శాండల్‌వుడ్‌ భామ యువ దర్శకుడు అయిన సుకు పూర్వాజ్‌తో రిలేషన్‌లో ఉందంటూ సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌ అవుతోంది. ఆమె ట్విట్టర్‌ హ్యాండిల్‌లో జ్యోతి పుర్వాజ్‌ అనే పేరు పెట్టుకున్నారు. ఇది చూసిన నెటిజన్లు ఆమె రెండో పెళ్లి చేసుకున్నారని అనుకుంటున్నారు.

Updated On 8 Sep 2023 6:59 AM GMT
Ehatv

Ehatv

Next Story