సూపర్‌స్టార్ మహేశ్‌బాబు(Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(trivikram) కాంబినేషన్‌లో రాబోతున్న గుంటూరు కారం(Guntur Karam) సినిమాపైనే ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్(Harika and Hasini Creations) పతాకంపై ఎస్.రాధాకృష్ణ(S.Radha Krishna) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే(Pooja Hegde), శ్రీలీలలు(Sreeleela) కథానాయికలుగా నటిస్తున్నారు.

Guntur Karam
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు(Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(trivikram) కాంబినేషన్‌లో రాబోతున్న గుంటూరు కారం(Guntur Karam) సినిమాపైనే ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్(Harika and Hasini Creations) పతాకంపై ఎస్.రాధాకృష్ణ(S.Radha Krishna) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే(Pooja Hegde), శ్రీలీలలు(Sreeleela) కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే హీరో మహేశ్‌బాబు గుంటూరు కారం సెట్స్‌లోకి మరోసారి అడుగుపెట్టడానికి కాస్త సమయం పట్టేలా ఉంది. నిజానికి ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల రెండో వారంలో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ షెడ్యూల్ కొన్ని అనివార్య కారణాల వల్ల జులై మొదటి వారంలో ప్రారంభించబోతున్నారట. ఇలాగని ఫిల్మ్‌నగర్‌లో చెప్పుకుంటున్నారు. అలాగే జూలైలో ప్రారంభమయ్యే కొత్త షెడ్యూల్ చిత్రీకరణ నాన్‌స్టాప్‌గా దాదాపు 40 రోజులకుపైగా జరుగుతుందన్న మాట కూడా ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నట్టు గతంలో సినిమా మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
