సంక్రాంతికి విడుదలైన పలు సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదలవ్వగా.. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు విడుదల కాబోతూ ఉన్నాయి. వెంకటేష్ హీరోగా నటించిన 'సైంధవ్' సినిమా ఓటీటీ విడుదల జరిగింది. ఇక మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం త్వరలో డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఫిబ్రవరి 9 నుండి స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంచబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. మహేష్ బాబు, శ్రీలీల ప్రధాన పాత్రలలో నటించిన […]
సంక్రాంతికి విడుదలైన పలు సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదలవ్వగా.. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు విడుదల కాబోతూ ఉన్నాయి. వెంకటేష్ హీరోగా నటించిన 'సైంధవ్' సినిమా ఓటీటీ విడుదల జరిగింది. ఇక మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం త్వరలో డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఫిబ్రవరి 9 నుండి స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంచబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ఇండియా అధికారికంగా ప్రకటించింది.
మహేష్ బాబు, శ్రీలీల ప్రధాన పాత్రలలో నటించిన గుంటూరు కారం సంక్రాంతికి విడుదల అయింది. మొదట్లో నెగటివ్ టాక్ ఎక్కువగా వచ్చినప్పటికీ చివరికి మంచి కలెక్షన్స్ వచ్చాయి. గుంటూరు కారం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే సాధించగలిగింది. థియేట్రికల్ రన్ లో 90% రికవరీ సాధించింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను మహేష్ బాబు కెరీర్‌లోనే రికార్డు ధరకు నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. స్ట్రీమింగ్ డీల్ ప్రకారం, సినిమా థియేట్రికల్ రిలీజ్ అయిన 4 వారాల తర్వాత స్ట్రీమ్ చేయడానికి షెడ్యూల్ చేశారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ బృందం స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించింది. గుంటూరు కారం ఫిబ్రవరి 9 నుండి ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకులు సినిమాని చూడనున్నారు.