ఓటీటీలో గుంటూరు కారం భారీ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంది

గుంటూరు కారం సినిమా సంక్రాంతికి థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల కంటే ఎక్కువ గ్రాస్ వసూలు చేయగలిగింది. మహేష్ బాబు కెరీర్ లో వరుసగా 100కోట్లకు పైగా షేర్ సాధించిన చిత్రంగా నిలిచింది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కెరీర్ లోనే రికార్డు ధరకు ఈ చిత్రం డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఇది ఒక ప్రాంతీయ టాలీవుడ్ చిత్రానికి అతి పెద్ద ధర. థియేట్రికల్ విడుదల తర్వాత 28 రోజుల తర్వాత ప్రసారం చేయాలనేది ఒప్పందం. ఫిబ్రవరి 9న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయడం ప్రారంభించింది.

ఓటీటీలో గుంటూరు కారం భారీ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో బహుళ భాషలలో ఈ సినిమా టాప్ 10 ట్రెండింగ్‌లో ఉంది. తెలుగు వెర్షన్ 1వ స్థానంలో, హిందీ వెర్షన్ 3వ స్థానంలో, తమిళ వెర్షన్ 5వ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. అతి తక్కువ సమయంలోనే ఇతర వెర్షన్‌లలో కూడా ట్రెండింగ్ లో ఉండడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక ఓటీటీలో విడుదలయ్యాక కుర్చీ మడతపెట్టి సాంగ్ సంచలనం సృష్టిస్తోంది.

Updated On 11 Feb 2024 4:01 AM GMT
Yagnik

Yagnik

Next Story