నటుడు గోవిందా, అతని భార్య సునీతా అహుజా 37 సంవత్సరాల వివాహం తర్వాత విడాకుల కోసం వెళుతున్నారు.

నటుడు గోవిందా, అతని భార్య సునీతా అహుజా 37 సంవత్సరాల వివాహం తర్వాత విడాకుల కోసం వెళుతున్నారు. కొంత కాలం పాటు విడివిడిగా జీవించిన తర్వాత అధికారికంగా విడిపోవాలని ఈ జంట నిర్ణయించుకున్నట్లు సమాచారం. వారు చివరిసారిగా ఎంటర్‌టైన్‌మెంట్ కి రాత్ షోలో పబ్లిక్‌గా కలిసి కనిపించారు. కార్యక్రమంలో, "సునీతా మేరీ జిందగీ మే జబ్సే ఆయీ హై, మెయిన్ సుధార్ గయా హూన్" అని చెప్పాడు. (సునీత నా జీవితంలోకి వచ్చినప్పటి నుండి, నేను చాలా ఇంప్రూవ్‌ అయ్యాను.)

ఓ ఇంటర్వ్యూలో సునీత మాట్లాడుతూ తాను, గోవింద ఎక్కువగా వేర్వేరు ఇళ్లలో నివసిస్తున్నామన్నారు. లేట్‌ నైట్‌ మీటింగ్స్, గ్యాదరింగ్స్‌ వల్ల గోవింద ఎక్కువగా తన బంగ్లాలో ఉంటున్నారని వెల్లడించారు. తమకు రెండు ఇళ్లు ఉన్నాయి, తమ అపార్ట్‌మెంట్ ఎదురుగా మాకు బంగ్లా ఉంది. నా ఫ్లాట్‌లో నా పిల్లలు ఉంటారు. గోవిందకు 10 మందిని పోగేసి కబుర్లు చెబుతాడని అందుకే ఆ ఇంట్లో గోవింద ఉంటారన్నారు. వీరి మధ్య మరో వ్యక్తి వచ్చినందునే విడిపోతున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి. గోవింద-సునీత మార్చి 11, 1987న వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. యశ్వర్ధన్ అహుజా, టీనా అహుజా. పుకార్లు వ్యాపిస్తూనే ఉన్నప్పటికీ, వారి రిలేషన్ షిప్ స్టేటస్ గురించి ఈ జంట నుంచి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విడాకుల పుకార్లను గోవిందా లేదా సునీత ధృవీకరించలేదు లేదా ఖండించలేదు.

ehatv

ehatv

Next Story