ఈ మధ్యకాలంలో వచ్చిన హారర్ కథలలో పొలిమేర(Polimera) సినిమా బెస్ట్ అనే చెప్పాలి.
ఈ మధ్యకాలంలో వచ్చిన హారర్ కథలలో పొలిమేర(Polimera) సినిమా బెస్ట్ అనే చెప్పాలి. సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పటికే రెండు భాగాలుగా వచ్చేసింది. ఇప్పుడు మూడో భాగాన్ని తీస్తున్నారు. షూటింగ్ కూడా మొదలయ్యింది. ఇదిలా ఉంటే పొలిమేర రెండో భాగాన్ని నిర్మించిన నిర్మాత మూడో భాగాన్ని నిర్మిస్తున్న ప్రొడ్యూసర్‌పై(Poducers) పోలీసు కేసు(Police Case) పెట్టారు. టాలీవుడ్‌లో ఇదో సంచలనంగా మారింది. పోలీసు కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే...
తాంత్రిక విద్యలు(Black magic), చేతబడి అంశాలతో మా ఊరి పొలిమేర సినిమా తీశారు. 2021లో వచ్చిన ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలోనే స్ట్రీమింగ్(OTT streaming) అయ్యింది. బాగా పేరు తెచ్చుకుంది. చూసిన వారంతా బాగుందని కితాబిచ్చారు. దీంతో రెండో భాగాన్ని తీసి లాస్టియర్ థియేటర్లలో విడుదల చేశారు. మొదట మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ పోనూ పోనూ సినిమా నిర్మాతలకు లాభాన్ని తెచ్చి పెట్టింది. రెండో భాగానికి గౌరి కృష్ణప్రసాద్(Krishna Prasad) నిర్మాతగా వ్యవహరించారు. నందిపాటి వంశీ(Nandipati Vamsi) డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించాడు. సినిమాను నిర్మించింది తానే కాబట్టి లాభాలలో తనకూ భాగం కావాలని అడుగుతుంటే వంశీ ఇవ్వడం లేదని, పైపెచ్చు చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని కృష్ణప్రసాద్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. పొలిమేర 2 సినిమా 30 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేసిన వంశీ ఇప్పటివరకు తనకు లాభాల్లో పైసా కూడా ఇవ్వలేదంటున్నారు కృష్ణప్రసాద్. తన షేర్ తనకు కావాలని డిమాండ్ చేస్తూ వంశీని కలిశానని, కానీ అతడు తనను చంపేస్తానని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే దానికి తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ బెదిరించాడని కృష్ణప్రసాద్ తన ఫిర్యాదులో తెలిపాడు. చిత్రమేమిటంటే ఈమధ్యనే లాంచ్ అయిన మూడో భాగానికి నిర్మాత వంశీ కావడమే!