మాచో హీరో గోపీచంద్(gopichan)d, బ్యూటిఫుల్ స్టార్ డింపుల్ హయతి(dimple Hayathi) జంటగా నటించిన సినిమా రామబాణం(Ramabanam). శ్రీవాస్(Srinivas) దర్శకత్వం వహించిన యాక్షన్, రొమాంటిక్, డ్రామా ఎంటర్టైనర్ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. శ్రీవాస్ , గోపీచంద్ కాంబినేషన్ లో మూడో సినిమా ఇది. మరి ఈమూవీతో ఇద్దరు హ్యాట్రిక్ హిట్ కొట్టారా.. గోపీచంద్ జాతకం ఎలా ఉంది చూద్దాం రివ్యూలో.

మాచో హీరో గోపీచంద్(Gopichand), బ్యూటిఫుల్ స్టార్ డింపుల్ హయతి(Dimple Hayathi) జంటగా నటించిన సినిమా రామబాణం(Rama Banam). శ్రీవాస్(Srinivas) దర్శకత్వం వహించిన యాక్షన్, రొమాంటిక్, డ్రామా ఎంటర్టైనర్ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. శ్రీవాస్ , గోపీచంద్ కాంబినేషన్ లో మూడో సినిమా ఇది. మరి ఈమూవీతో ఇద్దరు హ్యాట్రిక్ హిట్ కొట్టారా.. గోపీచంద్ జాతకం ఎలా ఉంది చూద్దాం రివ్యూలో.

రామబాణం సినిమాలో గోపీచంద్, డింపుల్ తో పాటు గా.. నాజర్, జగపతి బాబు(Jagapathi babu), వెన్నెల కిషోర్(Vennela kishore), సప్తగిరి(sapthagiri), అలీ(Ali), రాజా రవీంద్ర(Raja ravindher) లాంటి టాలీవుడ్ స్టార్స్ నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా... నిర్మాతలు టి జి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి నిర్మించారు.

చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు గోపీచంద్. చేసిన ప్రతీ సినిమా గోపీచంద్ ను నిరాశపరుస్తూనే ఉంది. ఎన్ని ప్రయత్నాలుచేసినా.. ఎన్ని ప్రయోగాలు చేసినా.. గోపీచంద్ కు కలిసిరావడంలేదు. మారుతీలాంటి గ్యారంటీ డైరెక్టర్ కూడా గోపీచంద్ కు హిట్ ఇవ్వలేకపోయాడు. మరి శ్రీవాస్ డైరెక్షన్ లో రామబాణం సినిమా తెరకెక్కింది. మరి ఈసారైనా గోపీచంద్ హిట్ కొడతాడా..?

రామబాణం కథ గురించి చూస్తే.. పక్కా ఫ్యామిలీ పిక్చర్. విలువలు, నియమాలతో బ్రతికే ఒక అందమైన ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన కథ. ఇక ఆ కుటుంబం ప్రశాంతంగా జీవిస్తుంటే.. ఈ ఫ్యామిలీని విలన్ డిస్ట్రబ్ చేస్తాడు. అప్పుడు.. తన ఆ ఫ్యామిలీలో ఒకడైన హీరో.. తన ప్యామిలీని ఎలా రక్షించుకున్నాడు. విలన్ ను ఏ రకంగా ఆడుకున్నాడు. ఈ మధ్యలో హీరో ఎన్ని స్ట్రగుల్స్ అనుభవించాడు అనేది సినిమా..?

ఇది రొటీన్ కథే అయినా.. కాస్త కొత్త కలర్ వేసి ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ శ్రీవాస్. కాని పాత వస్తువుకు ఎంత కొత్త కలర్ వేసినా.. అది అర్ధమయ్యేవారికి అర్ధం అవుతుంది. అలానే.. ఫ్యామిలీ స్టోరీస్ కు పెట్టింద పేరు గోపీచంద్. ఈ తరహా కథలు ఆయన చాలా చేశాడు. మరి అలాంటిది మళ్ళీ ఇలాంటి కథతోనే శ్రీవాస్ గోపీచంద్ తో సినిమా చేయడం.. మూవీ చూసే ప్రేక్షకులకు ఫస్ట్ హాఫ్ తోనే అర్ధం అవుతుంది.

శ్రీవాస్ డైరెక్టర్ గా చేసిన ఫస్ట్ మూవీ లక్ష్యం. ఈసినిమాలో గోపీచంద్, జగపతిబాబు అన్నదమ్ములుగా నటించారు. శ్రీవాస్-గోపీచంద్ కాంబోలో తెరకెక్కిన లౌక్యం పర్లేదు అనిపించుకుంది. హ్యాట్రిక్ కోసం వీరిద్దరూ మరోసారి కలిశారు. అయితే ఒక తరహా ఫార్ములా ఒకసారి వర్క్ అవుట్ అయ్యిందని ప్రతిసారి కాదు. కథ, కథనాల విషయంలో అప్డేట్ కాకపోతే కష్టం. అవుట్ డేటెడ్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ అంటున్నారు. ఏ మాత్రం కొత్తదనం లేని కథ కథనాలతో రామబాణం తెరకెక్కిందన్న మాట ఆడియన్స్ నుంచి వినిపిస్తోంది.

అయితే ఈసినిమాలో నటీనటుల విషయానికి వస్తే.. మాచో హీరో గోపీచంద్ యాక్షన్, యాక్టింగ్ అందరిని మెప్పించింది. కాని ఆయన ఎంచుకున్న కథ.. దాని కథనమే దెబ్బ కొట్టింది. సినిమాలో ఇతర నటీనటుల పరెఫామెన్స్ బాగున్నా.. కొన్ని బోరు కొట్టించే సీన్స్ బాగా విసిగించాయని తెలుస్తోంది. జగపతి బాబు, కుష్భు లాంటిస్టార్స్ ను ఎలా వాడుకోవాలో దర్శకుడికి అర్ధం కానట్టు కనిపిస్తోంది.

రామబాణం ఓ వర్గం ప్రేక్షకులను అలరిస్తుంది. ఈసినిమాలో కామెడీతో పాటు.. ఇంట్రవెల్ ట్వీస్ట్ బాగుంది. కాని ఆ టిస్ట్ ను సెకండ్ హాఫ్ లో నిలబెట్టుకోలేకపోయింది. ఖుష్బు, జగపతిబాబు, నాజర్, అలీలాంటి సీనియర్ స్టార్స్ యాక్టింగ్ సినిమాకు బాగా ప్లాస్ అయ్యింది. అంతే కాదు హీరోయిన్ డింపుల్ హయతి గ్లామర్ తో సినిమాపై కాస్త ఇంట్రెస్ట్ కలుగుతుంది.

ముఖ్యంగా ఈసినిమాలో కామెడీ బాగుంది. సాధారణంగా గోపీచంద్ సినిమాల్లో ఉండే కామెడీ.. ఈసినిమాలో కూడా వర్కౌట్ అయ్యింది. కాని టోటల్ గా ఈసినిమా గురించి చెప్పాలంటే.. రామబాణం గురితప్పిందనే చెప్పాలి. మరి ఈరోజే(05 మే) రిలీజ్ అయ్యింది కాబట్టి. వీకెండ్ వరకూ ..స్లోగా ఎక్కుతుందేమో చూడాలి.

Updated On 5 May 2023 1:44 AM GMT
Ehatv

Ehatv

Next Story