రామబాణం సినిమా(Rama Banam Movie) నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్(Official Trailer).. అయ్యింది. ఈ క్షణం ఈ ప్రయాణం నేను ఊహించింది కాదు.. నేను ప్లాన్ చేసిందీ కాదు అంటూ అదరిపోయే డైలాగ్ తో.. ట్రైలర్ స్టార్ట్ అవ్వగా.. గోపీచంద్(Gopichand)అద్భుతమైనటనతో సినిమాపైన అంచనాలు అమాంతం పెంచిందీ ట్రైలర్. టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపించంద్ నటించిన లేటెస్ట్ మూవీ రామబాణం.

రామబాణం సినిమా(Rama Banam Movie) నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్(Official Trailer).. అయ్యింది. ఈ క్షణం ఈ ప్రయాణం నేను ఊహించింది కాదు.. నేను ప్లాన్ చేసిందీ కాదు అంటూ అదరిపోయే డైలాగ్ తో.. ట్రైలర్ స్టార్ట్ అవ్వగా.. గోపీచంద్(Gopichand)అద్భుతమైనటనతో సినిమాపైన అంచనాలు అమాంతం పెంచిందీ ట్రైలర్.

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపించంద్ నటించిన లేటెస్ట్ మూవీ రామబాణం. ఫేమస్ టాలీవుడ్ డైరెక్టర్ ర్ శ్రీవాస్(Director Sriwass) తెరకెక్కిస్తున్న ఈసినిమాపై ఫస్ట్ నుంచీ మంచి అంచనాలు ఉన్నాయి. గతంలో వీరి కాంబోలో వచ్చిన లక్ష్యం, లౌక్యం ఎంత మంచి హిట్స్ అయ్యాయో అందరికి తెలుసు. ఇక వీరి కాంబోలో తెరకెక్కిన తాజా మూవీ హ్యాట్రీక్ మూవీ.. రామబాణం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై TG విశ్వ ప్రసాద్ మరియు వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్న ఈసినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.

రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు టీమ్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ మూవీ పై ఉన్న అంచనాల్ని భారీగా పెంచేసాయి. ఇక ఈమూవీలో హీరోయిన్ గా డింపుల్ హయతి నటిస్తుండగా.. ప్రత్యేక పాత్రలో జగపతి బాబు సందడి చేయబోతున్నారు. సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, గెటప్ శ్రీను, తరుణ్ అరోరా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తాజాగా రామబాణం మూవీ కి సంబంధించి అఫిషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు టీమ్.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్(Family Entertainer)లా కనిపిస్తున్న ఈ రామ బాణం మూవీ ట్రైలర్ ను రాజమండ్రి(Rajahmundry)లో రిలీజ్ చేశారు. ఈ క్షణం ఈ ప్రయాణం నేను ఊహించింది కాదు.. నేను ప్లాన్ చేసిందీ కాదు అనే గోపీచంద్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది.యూట్యూబర్ గా హీరోయిన్ ను ఇంట్రడ్యూస్ చేశారు. హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నీవేశాలకు ఏమాత్రం తక్కువ లేకుండా.. సాలిడ్ ట్రైలర్ ను చూపించారు. స్వచ్ఛమైన ఆహారం, మంచి బంధాలే మనిషిని కాపాడతాయంటూ సీన్లోకి జగపతి బాబు ఎంటరవుతాడు. ఈసారి జగపతి బాబును కాస్త డిఫరెంట్ గా చూపించబోతున్నట్టు తెలుస్తోంది.

రామబాణం మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చారు. రాజమహేంద్ర వరంలో, వి.ఎల్ పురం, మార్గని ఎస్టేట్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు టీమ్. ఇక ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నారు. ప్రమోషన్ పనుల్లో బిజీ గా ఉంటూనే పోస్ట్ ప్రొడక్షన్ నిర్వహిస్తున్నారు టీమ్. ఇక ఈ సినిమాను సమ్మర్ కానుక గా మే 5 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.

Updated On 20 April 2023 10:27 PM GMT
Ehatv

Ehatv

Next Story