పుష్ప(Pushpa) సినిమాతో రష్మిక(Rashmika) క్రేజ్ అమాంతం పెరిగింది. ఆమె ఇప్పుడు నేషనల్ క్రష్‌గా(National Crush) మారారు. బాలీవుడ్‌లో కూడా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు రష్మిక.

Ravi teja With Rashmika
పుష్ప(Pushpa) సినిమాతో రష్మిక(Rashmika) క్రేజ్ అమాంతం పెరిగింది. ఆమె ఇప్పుడు నేషనల్ క్రష్‌గా(National Crush) మారారు. బాలీవుడ్‌లో కూడా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు రష్మిక. ఇదిలా ఉంటే రవితేజ(Raviteja) సినిమాలో రష్మిక నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కొత్త జోడిని తెరపై చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి సఫలమైతే మాత్రం రవితేజ-రష్మిక జంట అభిమానులను అలరించడం ఖాయం. గోపీచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే కదా! క్రాక్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ కోసం ముందు శ్రీలీలను(Sreeleela) అనుకున్నారు మేకర్స్. ఇప్పుడు రష్మిక అయితే బెటరని భావిస్తున్నారు. ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో పట్టాలెక్కబోతున్నది.
