ఆదివారం అతిలోక సుందరి, అద్భుతమైన నటి దివంగత శ్రీదేవి(Sridevi) 60వ జయంతి ! స్వర్గానికి వెళ్లిన ఆ అతిలోక సుందరిని తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేదు. మర్చిపోలేరు కూడా! ఆమె బర్త్‌డే సందర్బంగా దిగ్గజ సెర్చింజన్‌ గూగుల్‌(Google) కూడా ఘనంగా నివాళులు అర్పించిందంటే శ్రీదేవి గొప్పదనం ఏమిటో అర్థమవుతుంది. ఆదివారం నాడు ఆమె సినీ, వ్యక్తిగత విశేషాలతో కూడిన డూడుల్‌ని(Doodle) అందుబాటులో ఉంచింది.

ఆదివారం అతిలోక సుందరి, అద్భుతమైన నటి దివంగత శ్రీదేవి(Sridevi) 60వ జయంతి ! స్వర్గానికి వెళ్లిన ఆ అతిలోక సుందరిని తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేదు. మర్చిపోలేరు కూడా! ఆమె బర్త్‌డే సందర్బంగా దిగ్గజ సెర్చింజన్‌ గూగుల్‌(Google) కూడా ఘనంగా నివాళులు అర్పించిందంటే శ్రీదేవి గొప్పదనం ఏమిటో అర్థమవుతుంది. ఆదివారం నాడు ఆమె సినీ, వ్యక్తిగత విశేషాలతో కూడిన డూడుల్‌ని(Doodle) అందుబాటులో ఉంచింది. ఈ ప్రత్యేకమైన డూడుల్‌ను ముంబాయికి చెందిన ఆర్టిస్ట్‌ భూమిక ముఖర్జీ రూపొందించారు. ‘సినిమాలపై అమితమైన ఆసక్తితో చిన్నప్పుడే ఇటువైపు అడుగులు వేశారు శ్రీదేవి.

పురుషాధిక్య రంగంలో తన అందం, అభినయంతో నాలుగు దశాబ్దాల్లో మూడు వందలకు పైగా చిత్రాల్లో మెప్పించారు. ఫ్యామిలీ డ్రామాలు.. కామెడీలతో ఆకట్టుకుంటూ.. ఒకానొక సందర్భంలో హీరోలు లేకుండానే తనే ప్రధాన పాత్రధారిగా మారి ఒంటి చేత్తో సినిమాలకు విజయాలు అందించారు. హిందీతోపాటు తమిళ, తెలుగు, మలయాళ చిత్రాల్లో స్టార్‌గా ఎదిగారు’ అని ఆమె విశేషాల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే స్టార్‌ హీరోయిన్‌ శ్రీదేవి కూతురుగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్‌(Janhvi kapoor) తన తల్లిని గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అయ్యింది. నీకు మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా. నానమ్మతో సినిమా సెట్‌లో దిగిన ఈ ఫోటో మీకు ఇష్టమైన ప్రదేశాలలో ఒకటి అని నాకు తెలుసు. ఈ రోజు నేను కూడా సినిమా సెట్‌లో ఉన్నా.

మీరు నాతో ఇలాగే ఉండాలని నేను గతంలో కంటే ఎక్కువగా కోరుకున్నా. వాస్తవానికి మీ 35వ పుట్టినరోజని మేము అందరినీ ఒప్పించగలము. నేను నిన్ను చూసి గర్విస్తున్నా. ఈ ప్రపంచాన్ని నీ కళ్లతో చూడగలుగతున్నా. మమ్మల్ని చూసి మీరు కూడా సంతోషిస్తారని నాకు తెలుసు. ప్రతి రోజు నిన్ను ప్రేమిస్తునే ఉంటా అమ్మా. మీరు ఈ భూమి మీద అత్యంత ప్రత్యేకమైన మహిళ. మీరు ఇప్పటికీ మాతో ఉన్నారని నాకు తెలుసు. మేము జీవితంలో ఎదగడానికి కారణం నువ్వే. ఈ రోజు నీకిష్టమైన పాయసం, ఐస్ క్రీములు తింటావని ఆశిస్తున్నాను' అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది జాన్వీ కపూర్‌. భర్త బోనీ కపూర్‌ కూడా తన భార్యతో కలిసి తీసుకున్న పాత ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌ కూడా పలు పాత ఫోటోలను షేర్‌ చేసి అమ్మను గుర్తు చేసుకుంది. పలు లవ్‌ ఎమోజీలతో పాటు హ్యాపీ బర్త్‌డే మామా అని రాసింది.

Updated On 14 Aug 2023 7:45 AM GMT
Ehatv

Ehatv

Next Story