వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం

GOAT సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ మంచి ఊపు మీద ఉన్నాయి. తలపతి విజయ్ కొత్త చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) సెప్టెంబర్ 5న విడుదల అవ్వగా ఏ మాత్రం బాగాలేదంటూ పలువురు విమర్శలు గుప్పించారు. అయితే శుక్ర, శనివారం నాడు కలెక్షన్స్ కాస్త ఊపందుకున్నాయి. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం శనివారం నాడు మంచి కలెక్షన్స్ రాబట్టి దేశీయ మార్కెట్‌లో రూ.100 కోట్ల మార్కును దాటగలిగింది.

GOAT శనివారం నాడే రూ. 33 కోట్లు సంపాదించింది. తమిళ వెర్షన్ నుండి రూ. 29.1 కోట్లు వచ్చాయి. ఈ సినిమా హిందీ వెర్షన్ దాదాపు రూ.2.15 కోట్లు రాబట్టగా, తెలుగు వెర్షన్ రూ.1.75 కోట్లు రాబట్టింది. భారతదేశంలో ఈ చిత్రం మూడు రోజుల మొత్తం నికర వసూళ్లు రూ. 102.5 కోట్లకు చేరాయి. తమిళ వెర్షన్ ద్వారా రూ. 91 కోట్లు వచ్చాయి. శుక్రవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ.155 కోట్లు రాబట్టిన ఈ చిత్రం వారాంతం నాటికి రూ.200 కోట్ల మైలురాయిని దాటే అవకాశం ఉంది. GOAT సినిమా ఓవర్సీస్ లో మంచి కలెక్షన్స్ సాధిస్తోందని తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ డబుల్ యాక్షన్ లో కనిపించాడు.


Sreedhar Rao

Sreedhar Rao

Next Story