గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌(Ram Charan) హీరోగా అగ్రదర్శకుడు శంకర్‌(Shankar)రూపొందిస్తున్న సినిమా గేమ్‌ ఛేంజర్‌(Game Changer Movie). ఈ సినిమాపై ఫ్యాన్స్‌ చాలా ఆశలు పెట్టుకున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతతాకంపై దిల్‌రాజ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. దర్శకుడు శంకర్‌ తనదైన శైలిలో సామాజిక అంశాలను చర్చిస్తూ పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు.

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌(Ram Charan) హీరోగా అగ్రదర్శకుడు శంకర్‌(Shankar)రూపొందిస్తున్న సినిమా గేమ్‌ ఛేంజర్‌(Game Changer Movie). ఈ సినిమాపై ఫ్యాన్స్‌ చాలా ఆశలు పెట్టుకున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతతాకంపై దిల్‌రాజ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. దర్శకుడు శంకర్‌ తనదైన శైలిలో సామాజిక అంశాలను చర్చిస్తూ పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ ఐఎఎస్‌ అధికారి పాత్రలో కనిపిస్తారట! తన సినిమాలలో హీరోలను కథానుగుణంగా విభిన్నమైన గెటప్పులలో చూపించడం శంకర్‌ ప్రత్యేకత. గేమ్‌ ఛేంజర్‌ సినిమాలో కూడా శంకర్‌ ఇదే సూత్రాన్ని ఫాలో అయ్యారని ఫిల్మ్‌ నగర్‌ టాక్‌! ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ ఏడు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారని అంటున్నారు. సామాజిక సమస్యలను చర్చించడంతో పాటు వాటికి పరిష్కార మార్గాలను చూపించే ధీరోదాత్తుడైన వ్యక్తిగా రామ్‌చరణ్‌ నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ఏడు గెటప్స్‌లో కనిపించబోతున్నారని చెబుతున్నారు.

Updated On 11 Aug 2023 7:22 AM GMT
Ehatv

Ehatv

Next Story