‌మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా, సమంత(Samantha) హీరోయిన్ గా నటించిన యాక్షన్ డ్రామా మూవీ రంగస్థలం(Rangasthalam Movie). సుకుమార్(Sukumar) డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమా టాలీవుడ్ లో ఎన్నో రికార్డ్స్ ను తిరగరాసింది. ఈ సినిమా నాన్ బాహుబలి క్యాటగిరిలో ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. 2018 లో రిలీజ్ అయిన ఈ మూవీ 216 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని సంచనలం సృష్టించింది.

జపాన్(Japan) లో సరికొత్త రికార్డ్ లు రాస్తోంది రంగస్థలం సినిమా(Rangasthalam Movie).. అప్పటి వరకూ ఇండియాన్ మూవీస్ సృష్టించిన రికార్డ్స్ ను తిరగరాస్తోది రంగస్థలం.


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా, సమంత(Samantha) హీరోయిన్ గా నటించిన యాక్షన్ డ్రామా మూవీ రంగస్థలం(Rangasthalam Movie). సుకుమార్(Sukumar) డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమా టాలీవుడ్ లో ఎన్నో రికార్డ్స్ ను తిరగరాసింది. ఈ సినిమా నాన్ బాహుబలి క్యాటగిరిలో ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. 2018 లో రిలీజ్ అయిన ఈ మూవీ 216 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని సంచనలం సృష్టించింది. ఈసినిమా . రామ్ చరణ్ లోని కంప్లీట్ యాక్టర్ బయట పెట్టి... సరికొత్త పవర్ స్టార్ ను.. ఈ సినిమా ఆడియన్స్ కి పరిచయం చేసింది.

ఇక తాజాగా ఈ సినిమా ఇప్పుడు జపాన్ లో రిలీజ్ అయ్యింది. మగధీర సినిమాతో జపాన్ లో రామ్ చరణ్ కి మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. అసలు ఇండియన్ సినిమాలకు జపాన్ లో డిమాండ్ ఎక్కువ. ఈమధ్యనే ఆర్ఆర్ఆర్ మూవీ జపాన్ లో.. రజనీ పేరు మీద ఉన్న అన్ని రికార్డ్స్ ను తుడిచిపెట్టేసింది. ప్రభాస్ కు జపాన్ లో డైహార్ట్ ఫ్యాన్స్ ఉండగా.. ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్ కు, ఎన్టీఆర్ కు కూడా అలాంటి ఫ్యాన్ బేస్ ఏర్పడింది జపాన్ లో.

తాజాగా రంగస్థలం చిత్రాన్ని జపాన్ లో విడుదల చేశారు. తొలిరోజే ఈ చిత్రం రికార్డులు బద్దలు కొడుతూ ప్రభంజనం సృష్టించింది. టోక్యో నగరంలో మొదటి రోజున 70 స్క్రీన్లలో విడుదల చేయగా, 2.5 మిలియన్ల యెన్లను వసూలు చేసింది. ఇండియాన్ మూవీస్ లో ... జపాన్ లో రిలీజ్ అయిన వాటిలో.. రిలీజ్ అయిన మోదటి రోజున ఈ స్థాయిలో వసూలు చేసిన తొలి సినిమాగా.. రంగస్థలం సరికొత్త రికార్డు నమోదు చేసింది.

RRR తో చరణ్ ఫాలోయింగ్ జపాన్ లో మరింత పెరిగింది. దీంతో సూపర్ హిట్ మూవీ రంగస్థలంని రిలీజ్ చేయాలంటూ డిమాండ్ రావడంతో.. నిన్న (జులై 14) జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద రంగస్థలం రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో పాటు ఇండియన్ బ్లాక్ బస్టర్ KGF 1, KGF 2 చిత్రాలు కూడా రిలీజ్ అయ్యాయి. అయితే జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద యశ్ కంటే చిట్టిబాబు డామినేషన్ ఎక్కువ కనిపిస్తుంది.

Updated On 16 July 2023 12:36 AM GMT
Ehatv

Ehatv

Next Story