బయోపిక్ హవా మొత్తం దేశమంతా యమా స్పీడుగా నడుస్తోంది. కాకపోతే బయోపిక్లను హేండిల్ చేసేవాళ్ళు హైరేంజ్ పీపుల్ అయితే వాటికొచ్చే కిక్కే వేరేగా ఉంటుంది. ఈ విషయంలో అనేకమైనా ఉదాహరణలను అలవోకగా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు వచ్చిన వార్త తిరుగులేని సందడిని, సంచలనాన్ని సృష్టిస్తోంది.
బయోపిక్(biopic) హవా మొత్తం దేశమంతా యమా స్పీడుగా నడుస్తోంది. కాకపోతే బయోపిక్లను హేండిల్ చేసేవాళ్ళు హైరేంజ్ పీపుల్ అయితే వాటికొచ్చే కిక్కే వేరేగా ఉంటుంది. ఈ విషయంలో అనేకమైనా ఉదాహరణలను అలవోకగా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు వచ్చిన వార్త తిరుగులేని సందడిని, సంచలనాన్ని సృష్టిస్తోంది. అదేంటంటే....గ్లోబల్ స్టార్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram chran) తన ఖాతాలో ఓ బయోపిక్‌ని వేసుకోబోతున్నారన్న వార్త ఆయన అభిమానులకే కాదు, సగటు ప్రేక్షకుడిని కూడా ఉత్తేజపరిచేదిగా భారీ ప్రచారం జరుగుతోంది.
అదే...రామ్ ఛరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు(Buchi babu) దర్శకత్వంలో త్వరలో చేయబోతున్న తాజా సినిమా ప్రపంచ ప్రఖ్యాత బలశాలి కోడి రామ్మూర్తి నాయుడు(Kodi rammurthy naidu) జీవితం ఆధారంగా రూపొందబోతోందన్న సమాచారం అందరికీ మహా ఊపునిచ్చింది. భారతదేశానికే గర్వకారణంగా ఎదిగి, తను పుట్టిన విజయనగర ప్రాంతానికి. తనవారికి ఎనలేని వైభవాన్ని ఆపాదించి, చరిత్రపుటలలో ఎన్నటికీ చెరిగిపోని స్థానాన్ని కైవశం చేసుకన్న కోడి రామ్మూర్తి నాయుడు జీవితం తెరకెక్కుతుందంటే అంతకన్నా పులకింత మరొకటి ఉండదు. గతకాలపు గర్బంలో దాగిపోయి, వెలుగు చూడని, ఈ తరంవారికి పూర్తిగా దూరమైపోయిన ఓ గొప్ప భారతీయుడు, ఇంకా గొప్పగా చెప్పాలంటే తిరుగులేని తెలుగువాడు...కోడి రామ్మూర్తి నాయుడు జీవితం మళ్ళీ మరోసారి అందరినీ మురిపించడానికి,ఈ తరం వారికి స్ఫూర్తిని పంచడానికి తెర రూపం దాల్చబోతోందంటే అంత కన్నా ఆనందించాల్సిన విషయం మరొకటి ఉండదు.
ఇటువంటి ఇతివృత్తాన్ని సినిమా కథగా స్వప్పించి, తెర రూపం కల్పించాలని భావించిన దర్శకుడు బుఛ్చిబాబు నిజంగా అభినందనీయుడైతే, బుచ్చిబాబు ఆలోచనని సమర్ధించిన రామ్ చరణ్ మరింత ప్రశంసనీయుడు. స్వాతంత్రం రాకముందే కాలప్రవాహంలో కొట్టుకుపోయిన రామ్మూర్తి నాయుడు ఆనాడే కింగ్ జార్జ్ ఫైవ్ ద్వారా ఇండియన్ హెర్క్యలస్ అనే బిరుదుగని పొంది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన రికార్డును సొంతం చేసుకున్నారు. విశాఖపట్టణం జిల్లా వీరఘట్టంలో జన్మించిన రామ్మూర్తి నాయడు చదువు నిమిత్తం విజయనగరం చేరుకుని అక్కడ వ్యాయామశిక్షణలో ఆరితేరి ఆ ప్రాంతంలోనే కాదు దేశం మొత్తం మీదనే తిరుగులేని బలశాలిగా, ఓడించలేని రెజ్లర్‌గా సుస్థిరమైన స్థానాన్ని తనకై తాను నెలకొల్పుకున్నారు. కుస్తీపోటీలు, మల్లయుద్ధాలలో ఓటమి ఎరుగుని వీరుడిగా ఎదిగిన ఆయన ఛాతీ మీద ఏనుగులను ఎక్కించుకోవడం.
మీసాలతో బళ్ళను ఈద్చేయడం లాంటి సాహసకృత్యాలను అవలీలగా ప్రదర్శించేవారు. ఒకసారి ఓక పోటీలో పాల్గొనడానికి వెళ్ళిన రామ్మూర్తినాయుడి మీద ఓర్వలేని అసూయపరులు విషప్రయోగం చేశారు. ఆ విషయం కొంచెం ఆలిస్యంగా తెలుసుకున్న నాయుడుగారు వెంటనే వేలకి వేలు గుంజీలు తీసి విషాన్ని కూడా జీర్ణించున్నారని విజయనగరం ప్రాంతంలో ప్రతీతి.
ఇటువంటి మాన్యవీరుడి జీవితంలో ప్రధాన ఘట్టాలను ఆధారంగా చేసుకుని నిర్మాణం కాబోతోందని మెగాఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్న ఇందులో రామ్ చరణ్ డబుల్ రోల్ చేయబోతున్నారన్నది మరో సంచలన వార్త.
నాగేంద్రకుమార్