గేమ్ ఛేంజర్(Game changer Movie) షూటింగ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) గాయపడ్డారు. ఆయన ముఖానికి గాయం అయినట్టు సమాచారం. దాంతో గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ మరోసారి వాయిదా పడినట్టు తెలుస్తోంది.

Ramcharan Injuried In Game Changer Shooting
గేమ్ ఛేంజర్(Game changer Movie) షూటింగ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) గాయపడ్డారు. ఆయన ముఖానికి గాయం అయినట్టు సమాచారం. దాంతో గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ మరోసారి వాయిదా పడినట్టు తెలుస్తోంది.
టాలీవుడ్ మెగా పవర్ స్టార్.. రామ్ చరణ్ కు షూటింగ్ లో గాయాలు అయినట్టు తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ షూటింగ్ లో ఆయన గాయపడినట్టు సమాచారం. ఈ మూవీ షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో ఆయన ముఖానికి గాయం(Face injury) అయినట్టు తెలుస్తోంది. దాంతో షూటింగ్ కు విరామం ప్రకటించక తప్పలేదు. అంతే కాదు గాయం ముఖానికి అవ్వడంతో చరణ్ కు ప్రాథమిక చికిత్స అందించారని తెలుస్తోంది. వెంటనే షూటింగ్ ప్రారంభించడానికి అనుకూలంగా లేకపోవడంతో, పది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు తెలిసింది.
సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్(Director Shankar) డైరెక్షన్ లో రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో నటిస్తున్నాడు. అయితే ఈమూవీ షూటింగ్ స్టార్ట్ అయిన ముందే.. ఇది చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో కొన్నిరోజులపాటు గేమ్ ఛేంజర్ షూటింగ్ కొన్ని రోజుల పాటు వాయిదా పడినట్టు సమాచారం. అయితే రామ్ చరణ్ గాయంపై ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
రామ్ చరణ్ కి అయ్యింది చిన్నగాయమే అవ్వడంతో.. ఆయన మేకప్ వేసుకుని షూటింగ్ చేస్తాను అన్నారట. అయితే చేసేది యాక్షన్ సీక్వెన్స్ లు కావడం.. ఈ గాయానికి మేకప్ తో కవర్ చేయడం కూదరదనిచెప్పారట. అంతే కాదు డాక్టర్ ప్రస్తుతం షూటింగ్ కాకుండా రెస్ట్ తీసుకోమని చెప్పినట్టు తెలుస్తుంది. కనీసం ఒక 10 రోజులు రెస్ట్ తీసుకోమని డాక్టర్ చరణ్ కి చెప్పినట్టు సమాచారం. అందుకే ప్రస్తుతం జరగాల్సిన యాక్షన్ షెడ్యూల్ వాయిదా పడినట్లు తెలుస్తుంది.
