ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్(Game Changer) మూవీ చేస్తున్నాడు చరణ్. ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. అయితే ఇటీవల మూవీ టీమ్ షూటింగ్ ను స్పీడ్ అప్ చేసింది. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ పరుగులు పెడుతోంది..

రామ్ చరణ్(Ram Charan) సడెన్ గా ఎయిర్ పోర్ట్ లో ప్రత్యక్ష్యం అయ్యాడు. ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు..? షూటింగ్ కా.. లేక ఏదైనా వెకేషన్ కా.. వెకేషన్ అయితే ఉపాసన, క్లింకార ఉండాలి కదా.. మరి మెగా పవర్ స్టార్ పయనం ఎటు..?

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్(Game Changer) మూవీ చేస్తున్నాడు చరణ్. ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. అయితే ఇటీవల మూవీ టీమ్ షూటింగ్ ను స్పీడ్ అప్ చేసింది. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ పరుగులు పెడుతోంది.. వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు(Dil Raju) భావిస్తున్నారు.

కాగా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ఈవెంట్ కోసం.. తన ఫ్యామిలీ కోసం దాదాపు మూడు నెలలకు పైగా ఈ మూవీ షూటింగ్ కు దూరంగా ఉన్న రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ ను పరులుగు పెట్టిస్తున్నాడు. తన పూర్తి సమయాన్ని కేటాయిస్తున్న చరణ్.. తాజాగా షూటింగ్ కోసం వెళుతూ శంషాబాద్ ఎయిర్ పోర్టు(Shamshabad Airport)లో కెమెరాల కంటబడ్డాడు. తనకిష్టమైన టోటల్ బ్లాక్ డ్రస్ లో రామ్ చరణ్ లాంజ్ లోకి వెళుతూ దర్శనమిచ్చాడు. చేతిలో ల్యాపీ బ్యాగ్, కళ్లకు గాగుల్స్ తో ఉన్న రామ్ చరణ్.. మీడియాను చూస్తూ.. చిరునవ్వులు చిందిస్తూ లోపలికి వెళ్లాడు.

పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న గేమ్ చేంజర్ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) కథానాయికగా నటిస్తోంది. రామ్ చరణ్, కియారా జంటగా నటించడం ఇది రెండోసారి. వీరిద్దరూ గతంలో వినయ విధేయ రామ సినిమాలో జోడీగా నటించడం తెలిసిందే. ఇక ఈమూవీ షూటింగ్ ఎక్కడ జరుగుతుదో తెలియాల్సి ఉంది. తాను మాత్రం షూటింగ్ కోసమే వెళ్లినట్టు సమాచారం.

Updated On 18 Aug 2023 12:14 AM GMT
Ehatv

Ehatv

Next Story