బిగ్‌బాస్(Bigg Boss) ఫైనల్ డే సందర్భంగా.. విజేతను ప్రకటించిన తర్వాత ఫ్యాన్స్‌ పేరుతో కొందరు నానా బీభత్సం సృష్టించిన సంగతి తెల్సిందే. అయితే వీరు సృష్టించిన బీభత్సంలో తన కారును కూడా ధ్వంసం చేశారని గీతూ రాయల్‌(Geetu Royal) పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిగ్‌బాస్‌ విజేతను ప్రకటించిన తర్వాత బజ్‌ ఇంటర్యూలు(Buzz Interview) పూర్తి చేసుకొని బయటకు వస్తుండగా కొందరు సైకోలు తన కార్‌పై దాడి చేశారని.. అద్దాలను ధ్వంసం చేశారని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. తన కారును ధ్వంసం చేసిన అల్లరి మూకలపై చర్యలు తీసుకోవాలని కోరింది.

ఈ పని ఎవరి ఫ్యాన్సో చేస్తారని అనుకోవడం లేదని.. బిగ్‌ బాస్‌ సెలెబ్రిటీలను చూసేందుకు తాగి వచ్చి ఈ అల్లరి మూకలు దాడులకు(Attack) పాల్పడ్డారని తెలిపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేను ఇంటర్వ్యూలు పూర్తి చేసుకుని బయటకు వెళ్తుండగా కొందరు.. గీతూ.. గీతూ.. అని అరుచుకుంటూ వచ్చారన్నారు. మా నాన్నకు బాగాలేదని హాస్పిటల్‌కు వెళ్లాలని చెప్పినా వినలేదని ఆమె వాపోయింది. దాదాపు రెండు గంటల పాటు తనని ఆపేశారని.. కొంత మంది అయితే కారు అద్దాలను ధ్వంసం చేసి.. చేతులు లోపలికి పెట్టి తనను లాగే ప్రయత్నం చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించారన్నారు. కష్టపడి కొనుక్కున్న కారును ధ్వంసం చేయకండి ఎంత చెప్పినా అల్లరి మూకలు వినలేదని వాపోయింది. తన కార్‌కు ఇంకా ఈఎంఐలు పే చేస్తున్నానని.. సెలెబ్రిటీలైనంత మాత్రానా కోట్లకు కోట్ల డబ్బులు ఉండవు కదా అన్నారు. దాడి చేసిన సమయంలో తన తమ్ముడు కూడా ఉన్నాడని.. వీరి చేష్టల కారణంగా వాడు కూడా భయపడ్డాడని ఆవేదన చెందింది. ఈ దుండగులు తాగొచ్చి బీభత్సం సృష్టించారని.. రెడ్‌ టీ షర్ట్ వేసుకొని, బట్టతల ఉన్న ఓ వక్తి రాడ్‌ తీసుకొచ్చి మరీ తన కారు అద్దాలు పగలగొట్టాడని.. ఆ బట్ట తలోడు దొరికితే వదిలిపెట్టనని చెప్పింది. అమర్ లేదా నేను నచ్చక దాడి చేశారనుకుందాం కానీ.. ఆర్టీసీ బస్సులను, దారిన పోయేవారిపై ఎందుకు దాడి చేశారని ఆమె ప్రశ్నించారు. కఠిన చర్యలు తీసుకోవాలని మాదాపూర్‌ పోలీసులకు గీతు రాయల్‌ విజ్ఞప్తి చేసింది.

Updated On 18 Dec 2023 9:33 AM GMT
Ehatv

Ehatv

Next Story