అంజలి(Anjali) హీరోయిన్‌గా ఆ మధ్య గీతాంజలి(Gitanjali) అనే హారర్(Horror) కామెడీ సినిమా వచ్చింది. సత్యం రాజేష్(Satyam Rajesh), శ్రీనివాస్‌రెడ్డి(Srinivas) కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా సూపర్ హిట్టయ్యింది. ఆ సినిమా వచ్చిన పదేళ్లకు ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. గీతాంజలి మళ్లీ వచ్చింది(Gitanjali malli vachindi) పేరుతో తెరకెక్కుతున్న ఆ సినిమాలో కూడా అంజలి, సత్యం రాజేశ్, శ్రీనివాస్‌రెడ్డి, షకలక శంకర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Gitanjali malli vachindi
అంజలి(Anjali) హీరోయిన్‌గా ఆ మధ్య గీతాంజలి(Gitanjali) అనే హారర్(Horror) కామెడీ సినిమా వచ్చింది. సత్యం రాజేష్(Satyam Rajesh), శ్రీనివాస్‌రెడ్డి(Srinivas) కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా సూపర్ హిట్టయ్యింది. ఆ సినిమా వచ్చిన పదేళ్లకు ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. గీతాంజలి మళ్లీ వచ్చింది(Gitanjali malli vachindi) పేరుతో తెరకెక్కుతున్న ఆ సినిమాలో కూడా అంజలి, సత్యం రాజేశ్, శ్రీనివాస్‌రెడ్డి, షకలక శంకర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నిన్నుకోరి, నిశ్శబ్దం సినిమాలకు పనిచేసిన కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి ఈ సినిమాకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రచయిత, నిర్మాత కోన వెంకట్(Kona venkat) సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. సాధారణంగా సినిమా ఫంక్షన్లు స్టార్ హోటల్స్‌లోనో, జేఆర్సీ కన్వెన్షన్‌లో జరుగుతాయి. అయితే ఈ సినిమా టీజర్‌ను మాత్రం చిత్రంగా స్మశానంలో(Graveyard) రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ నెల 24 తేదీ రాత్రి ఏడు గంటలకు బేగంపేట స్మశాన వాటికలో టీజర్ విడుదలవుతున్నది. ఇందుకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఇది వినూత్న ప్రయత్నం. ఎప్పుడు లేని విధంగా స్మశానంలో సినీ ఫంక్షన్‌ను నిర్వహించడం ఇదే తొలిసారి. దీంతో శ్మశాన వాటికలో టీజర్ లాంఛ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
