బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌(Bigg Boss 7) ప్రారంభమయ్యి రెండు వారాలు దాటిపోయింది. ఇప్పుడిప్పుడే షోలో ఆసక్తి పెరిగుతోంది. ప్రేక్షకులు కూడా నెమ్మదిగా పెరుగుతున్నారు. రోజురోజుకీ వెరైటీగా మారుతోంది. బిగ్‌బాస్‌ హౌస్‌లో 17వ రోజు విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం! శివాజీ(Shivaji) పవరస్త్ర దొంగలించిన విషయం తెలిసిందే కదా! దానిపై శివాజీ చిన్న పిల్లాడిలా తెగ బాధపడిపోతున్నాడు. సందీప్‌తో మాట్లాడుతూ తేజపై(Teja) అనుమానం వ్యక్తం చేశాడు.

బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌(Bigg Boss 7) ప్రారంభమయ్యి రెండు వారాలు దాటిపోయింది. ఇప్పుడిప్పుడే షోలో ఆసక్తి పెరిగుతోంది. ప్రేక్షకులు కూడా నెమ్మదిగా పెరుగుతున్నారు. రోజురోజుకీ వెరైటీగా మారుతోంది. బిగ్‌బాస్‌ హౌస్‌లో 17వ రోజు విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం! శివాజీ(Shivaji) పవరస్త్ర దొంగలించిన విషయం తెలిసిందే కదా! దానిపై శివాజీ చిన్న పిల్లాడిలా తెగ బాధపడిపోతున్నాడు. సందీప్‌తో మాట్లాడుతూ తేజపై(Teja) అనుమానం వ్యక్తం చేశాడు. వాడిని నామినేషన్స్‌ నుంచి సేవ్‌ చేస్తే నా పవరస్త్రనే దొంగిలిస్తాడా? వాడికి అసలు అర్హతే లేదని తెగ రెచ్చిపోయాడు శివాజీ. మరోవైపు పవరస్త్రను కొట్టేసిన అమరదీప్‌ చిలిపిపనులు మామూలుగా లేవు. శివాజీ, రతిక(Rathika) బెడ్స్‌ దగ్గర టిష్యూ పేపర్‌పై ఏఏ, ఏ ఏడీ అని రాసి హింట్స్‌ ఇచ్చాడు. కానీ వారు మాత్రం కనిపెట్టలేకపోయారు. అయితే పవరస్త్ర పోటీలో ఉన్న ప్రిన్స్‌ యవర్‌ మాట్లాడుతూ కంటెండర్‌గా నిలబడాలంటే ఓ పోటీ తట్టుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. ఇందులో భాగంగా ఓ బల్లపై గడ్డం పెట్టాలి. అతడిని నామినేట్‌ చేసిన తేజ, దామిని, రతిక డిస్ట్రబ్‌ చేస్తారు. కదలకుండా గంటసేపు నిలబడాలని నిబంధన పెట్టాడు. దీన్ని పాటించిన యవర్‌ కదలకుండా అలాగే నిలబడ్డాడు. అయితే దామిని, రతిక, తేజ మాత్రం పేడ, గడ్డి, షాంపూ నీళ్లు, మంచుగడ్డలతో ఆటలాడుకున్నారు. కానీ ఇందులో యవర్‌ గెలిచి నిలబడ్డాడు. ఇక యవర్‌ టాస్క్‌ ముగిసిన తర్వాత శోభాషెట్టిని(Shobha Shetty) నామినేట్‌ చేసిన వారి వీడియోలు చూపించారు. ప్రశాంత్‌, శుభశ్రీ వరకు పెద్దగా పట్టించుకుని ఈమె గౌతమ్‌తో మాత్రం పెద్ద గొడవ పెట్టుకుంది. ఫిజికల్‌గా స్ట్రాంగ్ అని కారణం చెప్పడంపై శోభా మండిపడింది. తను ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా లేకపోతే పుల్ రాజా పుల్ టాస్కులో ఎలా గెలుస్తాను? కుస్తీ పోటీల్లో ఎలా గెలుస్తాను? అంటూ గొడవ పెట్టుకున్నారు. దీంతో తాను అనుకున్న కారణాలు చెబుతూ గౌతమ్ చొక్కా విప్పేశాడు. అయితే అతడు షర్ట్ తీసి షో హాఫ్ చేస్తున్నాడని శోభాషెట్టి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.దీంతో గౌతమ్‌ ఇంకాస్తా ఓవర్‌ చేశాడు. అవసరమైతే ప్యాంట్ కూడా తీసేస్తానని చెప్పాడు. అలా మాటామాట పెరిగంది. ఒకానొక సమయంలో అసలు నీకు హౌస్‌లో ఉండటానికి అర్హతే లేదని గౌతమ్‌ అన్నాడు. గౌతమ్‌ అలా అన్నాడో లేదో శోభాషెట్టి గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది. హౌసులో నీకంటే ఎక్కువ రోజులు ఉండి చూపిస్తానని సవాల్‌ విసిరింది. మరోవైపు అమరదీప్‌ని ప్రియాంక నామినేట్ చేసిన వీడియోని కూడా చూపించారు. ఆ విధంగా బుధవారం ఎపిసోడ్‌ ముగిసింది.

Updated On 21 Sep 2023 12:36 AM GMT
Ehatv

Ehatv

Next Story