మణిరత్నం(Mani Ratnam) దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్(Ponniyin Selvan) సినిమాలో విక్రమ్(Vikram) నటనకు విమర్శకుల నుంచి కూడా మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా తర్వాత విక్రమ్ అభిమానులు తర్వాతి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Dhruva Nakshatram
మణిరత్నం(Mani Ratnam) దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్(Ponniyin Selvan) సినిమాలో విక్రమ్(Vikram) నటనకు విమర్శకుల నుంచి కూడా మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా తర్వాత విక్రమ్ అభిమానులు తర్వాతి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ధ్రువనక్షత్రం(Dhruva Nakshatram) విడుదలకు రెడీ అయ్యింది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దీనిని(Goutham Minon) రూపొందిస్తున్నారు. రీతూ వర్మ(Reethu Varma) ఇందులో హీరోయన్‌గా నటిస్తున్నారు. పార్తీపన్(Parthipan), రాధికా శరత్‌కుమార్(Radhika Sharath Kumar), సిమ్రాన్(Simran), ఐశ్వర్య రాజేశ్(Aishwarya Rajesh) తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సుమారు ఆరేళ్ల కిందట మొదలైన ఈ సినిమా షూటింగ్ కొంత భాగం లండన్‌లో కూడా జరుపుకుంది. ఇందులో నటుడు విక్రమ్ జాన్(John) అనే పవర్‌ఫుల్ పాత్రలో నటించారు.
నిజానికి ఈ సినిమా 2018లో విడుదల కావాల్సింది. అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల కాలేదు. ఈ చిత్రం రిలీజ్ గురించి చాలాసార్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు విడుదల మాత్రం కాలేదు. అయిదేళ్ల నుంచి ఇదిగో అదిగో అంటున్నారు మేకర్స్. ఇటీవలే ఈ సినిమాలోని ఓ పాటను విడుదల చేశారు. లేటెస్ట్‌గా రెండో పాటను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నట్టు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో త్వరలోనే జాన్‌ను చూస్తారు అని పేర్కొన్నారు. దీంతో ధ్రువనక్షత్రం సినిమాకు త్వరలో మోక్షం లభిస్తుందనే గట్టి నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. పొన్నియన్ సెల్వన్ సినిమా తర్వాత ధ్రువనక్షత్రం రాబోతోందని విక్రమ్ అభిమానులు ఆనందంతో ఎదురు చూస్తున్నారు.
