బిగ్ బాస్ హౌస్ లో ఉండగా శివాజీ - గౌతమ్ కృష్ణ మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉండేవి. ప్రతీసారి శివాజీని గౌతమ్ నామినేషన్ చేస్తూ వచ్చాడు. మొదట శివాజీకి తాను బయటపడినట్టు గౌతమ్ ఒప్పుకున్నాడు. ఇక నామినేషన్స్ సమయంలో వీరిద్దరి మధ్య వాదనలు జరుగుతూ వచ్చాయి. ప్రశాంత్ .. యావర్ లను శివాజీ సపోర్టు చేయడం, తన పట్ల వేరుగా వ్యవహరించడం గురించి గౌతమ్ కృష్ణ తరచూ బాధపడటమే కాకుండా..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 చివరి దశకు చేరింది. లాస్ట్ వీక్ ఇంటి నుంచి హీరో గౌతమ్ అనూహ్యంగా బయటకు వచ్చాడు. హౌస్ లో చివరి నామినేషన్లు కూడా జరిగిపోయాయి. ఇక ఇంటి నుంచి బయటకు రాగానే సంచలన కామెంట్స్ చేశాడు గౌతమ్. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. తనలోపల ఉన్న అభిప్రయాలు పంచుకుంటున్నాడు.

బిగ్ బాస్ హౌస్ లో ఉండగా శివాజీ - గౌతమ్ కృష్ణ మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉండేవి. ప్రతీసారి శివాజీని గౌతమ్ నామినేషన్ చేస్తూ వచ్చాడు. మొదట శివాజీకి తాను బయటపడినట్టు గౌతమ్ ఒప్పుకున్నాడు. ఇక నామినేషన్స్ సమయంలో వీరిద్దరి మధ్య వాదనలు జరుగుతూ వచ్చాయి. ప్రశాంత్ .. యావర్ లను శివాజీ సపోర్టు చేయడం, తన పట్ల వేరుగా వ్యవహరించడం గురించి గౌతమ్ కృష్ణ తరచూ బాధపడటమే కాకుండా.. ప్రశ్నిస్తూ ఉండేవాడు.

ఇక తనను ఉద్దేశ పూర్వకంగా గౌతమ్ టార్గెట్ చేస్తున్నాడని శివాజీ అసహనాన్ని ప్రదర్శించేవాడు. ఇక లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన గౌతమ్ కృష్ణ, వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంటూ వచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. " వీకెండ్ ఎపిసోడ్ లో శివాజీ గారి గురించి నేను నాగార్జున గారి దగ్గర ప్రస్తావించాను. అయితే నేను శివాజీ గారి గురించి ఏదైతే చెప్పాలనుకున్నానో అది స్పష్టంగా చెప్పలేకపోయాననే విషయం ఆ తరువాత నాకు అర్థమైంది. అతను మాటపై నిలబడే మనిషైతే కాదు" అని అన్నాడు.

"అమర్ కి .. నాకు మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. ఒక ఫ్రెండ్ గా నేరుగా చెప్పకుండా, నామినేషన్స్ లో ప్రస్తావించడం ఏంటని అడుగుతున్నారు. మొదటి నుంచి కూడా నేను సోలోగా ఆడుతూ వచ్చాను. నా ఫ్రెండ్స్ కదా నామినేట్ చేయకూడదని నేను అనుకోలేదు. అందువలన నామినేట్ చేస్తూ వెళ్లాను .. అది ఆటలో భాగం అంతే" అని చెప్పాడు. ఇక శివాజీపై గౌతమ్ చెసిన కామెంట్స ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక హౌస్ లో ఆరుగురు సభ్యులు ఉండగా.. ఈవారం ఎలిమినేషన్ తో ఫైనల్ 5 కన్ ఫార్మ్ అవుతుంది. ఇక విన్నర్ ఎవరు అనేది వచ్చేవారం తెలబోతోంది.

Updated On 6 Dec 2023 7:13 AM GMT
Ehatv

Ehatv

Next Story