బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ను(Salman Khan) చంపడమే లక్ష్యంగా పెట్టుకున్న గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌(Lawrence Bishnoi) గ్యాంగ్‌ అందుకోసం పథకాలు పన్నింది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ను(Salman Khan) చంపడమే లక్ష్యంగా పెట్టుకున్న గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌(Lawrence Bishnoi) గ్యాంగ్‌ అందుకోసం పథకాలు పన్నింది. ఆ మధ్యన సల్మాన్‌ ఇంటికెళ్లి హత్య చేద్దామనుకున్నారు కానీ ప్లాన్‌ ఫలించలేదు. అప్పుడు జరిగిన కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా అయిదుగురు నిందితులపై నవీ ముంబాయ్‌ పోలీసులు ఛార్జ్‌ షీట్ దాఖలు చేశారు. అందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సల్మాన్‌ హత్యకు పాతిక లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నారని,

లు చేశారు. ఈ ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2023 ఆగస్టు నుంచి 2024 ఏప్రిల్‌ వరకు నెలల పాటు హత్యకు ప్లాన్‌ను రూపొందించారని, ఇందుకోసం ఆధునిక ఆయుధాలను కూడా కొనుగోలు చేయాలనుకున్నారని పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగానే నిందితులు ఏకే-47, ఎం16, ఏకే-92 తుపాకులు, హై-కాలిబర్‌ ఆయుధాలను పాకిస్తాన్‌ నుంచి కొనుగోలు చేయాలని అనుకున్నారని పోలీసులు చెప్పారు. ఇందుకోసం పాకిస్తాన్‌లోని ఆయుధ వ్యాపారితో సంప్రదింపులు జరుపుతున్నామని నిందితుల్లో ఒకరు విచారణలో తెలిపినట్టు పోలీసులు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. 2022లో పంజాబ్‌ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యలో ఉపయోగించిన జిగానా పిస్టల్‌తో సల్మాన్‌ను చంపాలని నిందితుల ముఠా భావించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. జిగానా పిస్టల్‌ టర్కీలో తయారవుతుందన్న విషయం తెలిసిందే. సల్మాన్‌ హత్య కుట్రలో భాగంగా సల్మాన్‌ ఫామ్‌హౌస్‌ పరిసర ప్రాంతాలు, బాంద్రాలోని నివాసం సహా షూటింగ్‌ ప్రదేశాల్లో బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చెందిన సుమారు 70 మంది రెక్కీ నిర్వహంచారని, సల్మాన్‌ కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వచ్చారని పోలీసులు తెలిపారు.

ఈ ఏడాది ఏప్రిల్‌ 14వ తేదీన ముంబాయిలోని బాంద్రా ఏరియాలోని సల్మాన్‌ ఖాన్‌ నివాసం ఉండే గెలాక్సీ అపార్టుమెంట్ (Galaxy Apartments) దగ్గర కాల్పులు జరిగాయి. బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మూడు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అపార్ట్‌మెంట్స్‌ వద్ద సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. వాటి ఆధారంగా నిందితులను గుజరాత్‌లో అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపింది విక్కీ గుప్తా, సాగర్‌ పాల్‌ అని తెలుసుకున్నారు. వీరికి ఆయుధాలు సరఫరా చేశారన్న ఆరోపణలపై అనూజ్‌ తపన్‌, సోను సుభాశ్‌ చందర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 17 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పటి వరకూ ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. వారిలో అనుజ్‌ థాపన్‌ అనే నిందితుడు మే 1వ తేదీన పోలీసు లాకప్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.

Eha Tv

Eha Tv

Next Story