విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా మొదటి వీకెండ్

విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా మొదటి వీకెండ్ మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకున్నా.. రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూన్ 14న ఈ సినిమా OTT ప్రీమియర్‌ను ప్రదర్శిస్తున్నారు. విడుదలైన 2 వారాల్లో చిన్న స్క్రీన్‌లలో ప్రేక్షకుల ముందు ఉంటుంది. ఈ పరిణామం సానుకూలమైనది కాదు. ముఖ్యంగా భవిష్యత్తులో రానున్న చిన్న, మధ్యతరహా బడ్జెట్ చిత్రాలకు థియేటర్ రన్ గండం ఉంటుంది. సినిమా విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీలో విడుదలైతే సాధారణ జనం థియేటర్లలోకి అడుగు పెట్టడం కష్టమే.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి కీలక పాత్రల్లో నటించారు. మిశ్రమ సమీక్షలు, టాక్‌తో విడుదలైంది. 80వ దశకంలో జరిగే కథ. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందించింది.

Updated On 9 Jun 2024 9:36 PM GMT
Yagnik

Yagnik

Next Story