మెగాపవర్‌ స్టార్‌ రాంచరణ్‌ నటిస్తున్న 'గేమ్‌ ఛేంజర్( Game Changer)' సినిమా నుంచి అప్డేట్‌ వచ్చింది.

మెగాపవర్‌ స్టార్‌ రాంచరణ్‌ నటిస్తున్న 'గేమ్‌ ఛేంజర్( Game Changer)' సినిమా నుంచి అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా సెకండ్‌ సింగిల్‌ను విడుదల చేస్తామని సినిమా యూనిట్‌ ప్రకటించింది. చెర్రీ డ్యాన్స్(Cherry Dance) చేస్తున్నట్లు ఉన్న ఓ పోస్టర్‌ను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. చరణ్ తలకి ఎర్ర కండువా కట్టుకుని ఉండడం గమనార్హం. రెండో సాంగ్‌ కోసం రాంచరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలై 'జరగండి(Jaragandi)' సాంగ్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. తొలి సాంగ్‌లో చూపించిన విజువల్స్‌ అదిరిపోయాయి. సెకండ్ సింగిల్‌ను కూడా అదే స్థాయిలో ప్లాన్ చేశారు. దర్శకుడు శంకర్‌ (Shankar) ఆధ్వర్యలో వస్తున్నీఈ మూవీలో బాలీవుడ్‌ స్టార్‌ కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు తమన్‌ (Thaman)సంగీతం అందిస్తున్నాడు. గేమ్‌ ఛేంజర్‌ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్‌ కానుకగా విడుదల చేస్తామని వెంకటేశ్వర క్రియేషన్స్‌(Venkateswara Creations) ప్రకటించింది. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) తర్వాత వస్తున్న గేమ్‌ ఛేంజర్‌ ద్వారా మరో భారీ హిట్‌ కొట్టాలనిరాంచరణ్‌(Ram Charan)చూస్తున్నారు. శంకర్, కమల్‌ హాసన్‌ జోడిగా వచ్చిన భారతీయుడు-2 సినిమా ఫ్లాప్‌ కావడంతో శంకర్‌ కూడా ఈ సినిమాపై మరింత దృష్టి పెట్టారు. అయితే త్వరలోనే సెకండ్ సింగిల్ వస్తుందన్న వార్తలతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు

ehatv

ehatv

Next Story